సెన్సార్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ బయోపిక్

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.

Ruthvik
Published on: 5 Jan 2019 1:17 PM IST
NTR biopic
X
NTR biopic

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి భాగం గా విడుదల కానున్న ఈ సినిమా ఇవాళ సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకుంది. క్లీన్ 'యూ' సర్టిఫికేట్ తో బయటకు వచ్చిన 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాలో సెన్సార్ బోర్డ్ ఎటువంటి అభ్యంతరాలు చెప్పలేదు. ఈ సినిమా రన్ టైం 170 నిమిషాలని సమాచారం.

ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఎన్టీఆర్ అవతారంలో ఉన్న బాలకృష్ణ పోస్టర్ ను విడుదల చేసింది. బాలీవుడ్ భామ విద్యాబాలన్ ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. రానా దగ్గుబాటి, నిత్యామీనన్, రకుల్ ప్రీత్, సుమంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా జనవరి 9 వ తారీకున విడుదలకు సిద్ధంగా ఉంది. నందమూరి బాలకృష్ణ సినిమా స్వయంగా నిర్మించారు. ఇప్పటికే చిత్ర ట్రైలర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Ruthvik

Ruthvik

Next Story