ఎన్టీఆర్ బయోపిక్ పూర్తిగా సిద్ధమయినట్టే

ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి పార్ట్ గా తెరకెక్కనున్న 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా జనవరి 9వ తారీఖున విడుదలకు సిద్ధమవుతోంది. విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం నిర్మాణాంతర పనులతో బిజీగా ఉంది.

Ruthvik
Published on: 3 Jan 2019 4:43 PM IST
NTR biopic
X
NTR biopic

ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి పార్ట్ గా తెరకెక్కనున్న 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా జనవరి 9వ తారీఖున విడుదలకు సిద్ధమవుతోంది. విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం నిర్మాణాంతర పనులతో బిజీగా ఉంది. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు క్రిష్ మరియు చిత్రబృందం పగలు రాత్రి కష్టపడి పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీలు పూర్తి చేశారు. కీరవాణి సంగీతం కూడా పూర్తి చేశారు. అంటే ఈ సినిమా ఇప్పుడు పూర్తిగా రెడీ అయిపోయినట్లే. కేవలం సెన్సార్ పనులు మాత్రమే బాకీ ఉన్నాయి.

ఈ సినిమా త్వరలో సెన్సార్ పనులు పూర్తి చేసుకోనుంది. నందమూరి తారకరామారావు పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తుండగా ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వీరిద్దరూ మాత్రమే కాక రానా దగ్గుబాటి రకుల్ ప్రీత్ సుమంత్, నిత్యా మీనన్, హన్సిక తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్.బి.కె ఫిలిమ్స్ పతాకంపై బాలకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విష్ణు ఇండూరి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా రెండవ భాగం 'ఎన్టీఆర్ మహానాయకుడు' ఫిబ్రవరి 7వ తారీఖున విడుదల కానుంది.

Ruthvik

Ruthvik

Next Story