స్టార్ హీరోకు థియేటర్లు లేవట

సూపర్ స్టార్ రజిని కాంత్ సినిమాలు అటు తమిళ్ లోనే కాక తెలుగులో కూడా విడుదలవుతాయని తెలిసిన విషయమే. అయితే '2.O' సినిమాను పక్కన పెడితే గత కొంతకాలంగా రజిని సినిమాలు తెలుగులో అంతగా హిట్ అయిన దాఖలాలు లేవు.

Ruthvik
Published on: 5 Jan 2019 3:35 PM IST
film Petta
X
film Petta

సూపర్ స్టార్ రజిని కాంత్ సినిమాలు అటు తమిళ్ లోనే కాక తెలుగులో కూడా విడుదలవుతాయని తెలిసిన విషయమే. అయితే '2.O' సినిమాను పక్కన పెడితే గత కొంతకాలంగా రజిని సినిమాలు తెలుగులో అంతగా హిట్ అయిన దాఖలాలు లేవు. అయితే ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన సినిమా 'పేట' సినిమా సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు రిలీజ్ గురించి క్లారిటీ లేని సమయంలో అశోక్ వల్లభనేని 'పేట' సినిమా తెలుగు రైట్స్ ను కొనుక్కున్నారు. ఈ మధ్యనే 'పేట' సినిమా తెలుగు ట్రైలర్ కూడా విడుదలైంది.

అ ట్రైలర్ ద్వారా తమిళంలోనే కాక తెలుగులో కూడా ఈ సినిమా జనవరి 10 వ తారీకున విడుదల కాబోతోందని తెలియజేశారు దర్శక నిర్మాతలు. అయితే ఈ సంక్రాంతికి ఇప్పటికే తెలుగులో రెండు పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. ఒకవైపు ఎన్టీఆర్ బయోపిక్ జనవరి 9న విడుదల కానుంది మరోవైపు 'వినయ విధేయ రామ' జనవరి 10 వ తారీఖున విడుదలవనుంది. ఈ రెండు పెద్ద సినిమాలు కావడంతో థియేటర్లు అన్ని ఈ రెండింటితో నిండిపోతున్నాయి. 'పేట'కు థియేటర్లు లభించటం లేదు. దీనివల్ల విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సిమ్రాన్, త్రిష, విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్దిఖీ, బాబీ సింహ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Ruthvik

Ruthvik

Next Story