Nithiin Check Trailer: ఆదిత్యకు క్షమాభిక్ష అవకాశం ఉందా? 'చెక్' ట్రైలర్ రిలీజ్

Samba Siva Rao
Published on: 3 Feb 2021 7:57 PM IST
Nithiin Check Trailer: ఆదిత్యకు క్షమాభిక్ష అవకాశం ఉందా? చెక్ ట్రైలర్ రిలీజ్
X

Nithiin Check Trailer

నితిన్‌ కథానాయకుడిగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'చెక్'. ఈ సినిమా సంబంధించిన ట్రైలర్‌ విడుదలైంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్, టీజర్ కు మంచి రెస్ఫన్స్ వచ్చింది. నితిన్ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా వారియర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీలో నితిన్ ఖైదీగా కలిపించనున్నాడు‌. ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది.

ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. 'యద్భావం తద్భవతి' అన్న ఉద్బోధతో ట్రైలర్‌ ప్రారంభమైంది. జైల్లో ఓ పెద్దాయన ఒంటరిగా చెస్‌ ఆడుతుండటం చూసిన ఆదిత్య(నితిన్)‌ ప్రత్యర్థి ఉంటేనే కిక్కు.. అంటూ ఆటలో దిగాడు. నితిన్ ఎత్తుగడ చూసి ఆశ్చర్యపోవడం పెద్దాయన వంతైంది. చెస్‌లో ఉన్న ఒక్కో పావు గుణగణాలను చెప్తూ ఎలా ఎదుర్కొనాలో.. సరిగ్గా సరిపోయే పాత్రలను తెరమీద చూపించారు. మొత్తానికి కటకటాల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఆదిత్య చదరంగంలో కింగ్ అని తెలుస్తోంది. న్యాయవాది పాత్రలో రకుల్ కనిపిస్తోంది. ఆదిత్య దేశద్రోహి అన్న ముద్ర చెరిపేసేందుకు లాయర్‌ రకుల్ ప్రయత్నిస్తోంది . ప్రియా ప్రకాష్ వారియర్‌తో రొమాంటిక్ యాంగిల్‌ను కూడా ట్రైలర్‌లో చూపించారుే.

ఈ మూవీ ట్రైలర్ ఆద్యాతం ఆకట్టుకుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ఈనెల 26న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో సిమ్రన్ చౌదరి, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, హర్ష వర్ధన్, సీవీఎల్ నరసింహారావు, మేకా రామకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. కళ్యాణి మాలిక్ సంగీతం సమకూరుస్తున్నారు. నితిన్ గత ఏడాది భీష్మ సినిమాతో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story