సినిమా టైటిల్ మార్చేసిన నిఖిల్

సినిమా టైటిల్ మార్చేసిన నిఖిల్
x
Highlights

హిట్ సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నిఖిల్ కి 'కేశవా' సినిమాతో బ్రేక్ పడింది. తర్వాత విడుదలైన 'కిరాక్ పార్టీ' కూడా పరవాలేదు అనిపించుకుంది. ఇప్పుడు...

హిట్ సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నిఖిల్ కి 'కేశవా' సినిమాతో బ్రేక్ పడింది. తర్వాత విడుదలైన 'కిరాక్ పార్టీ' కూడా పరవాలేదు అనిపించుకుంది. ఇప్పుడు 'ముద్ర' అనే సినిమాతో నిఖిల్ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ యువ హీరో తన సినిమా టైటిల్ ను ఈ మధ్యనే మార్చాడు. ఇప్పుడు ఆ సినిమా టైటిల్ 'ముద్ర' కాదు 'అర్జున్ సురవరం'. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్నాడు నిఖిల్. తన సినిమా టైటిల్ మరియు పోస్టర్ మాత్రమే కాక విడుదల తేదీని కూడా ఖరారు చేశాడు.

'అర్జున్ సురవరం'గా మారిన నిఖిల్ సినిమా మార్చి 29 వ తారీఖు న విడుదల కానుంది. థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు. తమిళ సినిమా 'కనితన్' కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ సినిమాలకు దర్శకత్వం వహించిన టీ.ఎన్. సంతోష్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. సామ్ సి.ఎస్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories