కరోనానే కాదు.. నా పెళ్లిని ఏదీ ఆపలేదు: నిఖిల్

ఏప్రిల్‌ 16న వివాహం నిశ్చయించారు. గత కొన్ని రోజులుగా నిఖిల్‌, పల్లవి ప్రేమలో ఉన్నారు. నిఖిల్‌ ఆమెను గోవా తీసుకెళ్లి.. అక్కడ తన ప్రేమను చెప్పారు.

admin1
Updated on: 16 March 2020 9:54 PM IST
కరోనానే కాదు.. నా పెళ్లిని ఏదీ ఆపలేదు: నిఖిల్
X
Nikhil(File photo)

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యువ కథానాయకుడు నిఖిల్‌ పెళ్లి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఆయన స్పందించారు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే తన పెళ్లి జరుగుతుందని స్పష్టం చేశారు. ఏప్రిల్‌ 16న నా వివాహం జరగబోతోంది. ఆ తేదీన పెళ్లి జరగకుండా..ఏదీ నన్ను ఆపలేదు. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే మేం గుడిలోనైనా వివాహం చేసుకుంటాం. నా వివాహాన్ని వాయిదా వేయడం నాకిష్టం లేదని నిఖిల్ చెప్పారు. నిఖిల్‌ భీమవరంకు చెందిన వైద్యురాలు పల్లవిని వివాహం చేసుకోబోతున్నారు. ఇటీవల కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వీరి నిశ్చితార్థం జరిగింది.

ఏప్రిల్‌ 16న వివాహం నిశ్చయించారు. గత కొన్ని రోజులుగా నిఖిల్‌, పల్లవి ప్రేమలో ఉన్నారు. నిఖిల్‌ ఆమెను గోవా తీసుకెళ్లి.. అక్కడ తన ప్రేమను చెప్పారు. ఆ తర్వాత పెద్దల సమ్మతితో నిశ్చితార్థం జరిగింది. నిఖిల్‌ ప్రస్తుతం కార్తికేయ 2 షూటింగ్‌లో ఉన్నారు. మరోపక్క పెళ్లి పనులు వేగంగా జరుగుతున్నాయి.

admin1

admin1

Next Story