నిహారిక కొణిదెల ఇన్ అల్లు అర్జున్ మూవీ

నిహారిక కొణిదెల ఇన్ అల్లు అర్జున్ మూవీ
x
Highlights

మెగా ఫ్యామిలీ ముద్దుల వారసురాలు నిహారిక కొణిదెల అల్లు అర్జున్ సినిమాలో మెరవబోతోంది. సుకుమార్ దర్శకత్వంలో త్వరలో పట్టాలెక్కనున్న ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నిహారిక నటించనున్నట్టు సమాచారం.

మెగాఫ్యామిలీ ముద్దుల వారసురాలు నిహారిక. సినిమాల్లో నటించాలనే ఆసక్తి తో వెబ్ సిరీస్ లతో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. ఆ తరువాత సినిమాల్లోకి అడుగు పెట్టింది. ఒక పక్క మెగా ట్యాగ్ లైన్ ని మోయాల్సిన బాధ్యత.. మరోపక్క కుటుంబ నేపధ్యానికి ఇబ్బంది కలగనీయకూడదనే పరిస్థితుల మధ్యలో జాగ్రత్తగా ఎంపిక చేసిన సినిమాల్లో మాత్రమే నటించగలిగారు. మూడు సినిమాల్లో నటించినా అవి ఆమెకు అంతగా బ్రేక్ ఇవ్వలేదు. దీంతో సినిమాలను పక్కన పెట్టాలని ఆమె నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. వెబ్ సిరీస్ లకే పరిమితమవ్వాలని ఆమె చూస్తున్నట్టు చెప్పుకున్నారు. చాన్నాళ్ళుగా ఆమెకు సంబంధించి సినిమా వార్తలు ఏవీ రాలేదు. దాంతో ఆమె ఇక సినిమాల్లో కనిపించరని అందరూ భావించారు.

ఇప్పుడు ఆమె ఓ సినిమాలో నటించానున్నారనే వార్త సినీవర్గాల్లో ప్రచారం అవుతోంది. అది కూడా బన్నీ సినిమాలో ఆమెకు అవకాశం వచ్చిందనేది ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నారు. అది పూర్తయిన వెంటనే సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా మొదలు కానుంది. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రకి నిహారిక అయితే బావుంటుందని సుకుమార్ అనుకున్నారట. ఇదే విషయాన్ని బన్నీకి చెప్పి.. నిహారికను ఒప్పించమని కోరారట. దాంతో అల్లు అర్జున్ ఆమెను ఈ సినిమాలో చేయడానికి ఒప్పించారని చెబుతున్నారు. ఈ సినిమాలో నిహారిక పాత్రకు సంబంధించిన వివరాలను చిత్ర యూనిట్ త్వరలో ప్రకటించనుందని సమాచారం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories