రామ్ సరసన ఇద్దరు బెంగళూరు భామలు

రామ్ సరసన ఇద్దరు బెంగళూరు భామలు
x
Highlights

ఈ మధ్యనే ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన 'హలో గురు ప్రేమకోసమే' సినిమా అనుకున్న ఫలితాలను సాధించలేదు. ఇక ఈ సారి కచ్చితంగా హిట్ అందుకోవాలనే కసితో డ్యాషింగ్...

ఈ మధ్యనే ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన 'హలో గురు ప్రేమకోసమే' సినిమా అనుకున్న ఫలితాలను సాధించలేదు. ఇక ఈ సారి కచ్చితంగా హిట్ అందుకోవాలనే కసితో డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో చేతులు కలిపాడు రామ్. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో 'ఇస్మార్ట్ శంకర్' అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్ సరసన 'నన్ను దోచుకుందువటే' ఫేమ్ నభ నటేష్ మరియు 'సవ్యసాచి' ఫేమ్ నిధి అగర్వాల్ నటించనున్నారని తెలుస్తోంది. వీరిద్దరూ మొదటి సినిమాతోనే మెప్పించినప్పటికీ సరైన హిట్లు అందుకోలేకపోయారు. ఇక ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలనే ఆశలు అన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వారిద్దరూ బెంగళూరుకు చెందిన భామలే. మరి ఈ బెంగళూరు భామలు రామ్ కి ఎంతవరకు హిట్ ఇవ్వగలరో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories