Karthika Deepam: వామ్మో..కార్తీకదీపం 'దీపక్క' డిమాండ్ మామూలుగా లేదుగా!

Karthika Deepam: వామ్మో..కార్తీకదీపం దీపక్క డిమాండ్ మామూలుగా లేదుగా!
x
Highlights

మెగాస్టార్ సైరా..సూపర్ స్టార్ మహర్షి..ఎనర్జిటిక్ స్టార్ ఇస్మార్ట్ శంకర్ ఇవన్నీ వెండితెర మీద వెలిగి ఉండవచ్చు. కానీ బుల్లితెర మీద మాత్రం ఒక దీపం ముందు...

మెగాస్టార్ సైరా..సూపర్ స్టార్ మహర్షి..ఎనర్జిటిక్ స్టార్ ఇస్మార్ట్ శంకర్ ఇవన్నీ వెండితెర మీద వెలిగి ఉండవచ్చు. కానీ బుల్లితెర మీద మాత్రం ఒక దీపం ముందు వెలవెలబోయాయి. టీవీలో ఈ స్టార్ల సినిమాలు పాతవి వచ్చినా పిచ్చ పిచ్చగా చూసే ప్రేక్షకులు.. ఇప్పుడు మాత్రం కొత్త సినిమాలు వచ్చినా పెద్దగా స్పందించడం లేదు. ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీనికి కారణం ఒక్కటే..'కార్తీకదీపం' సీరియల్.

రాజమౌళి బాహుబలి సీక్వెల్ తీసినపుడు రెండో పార్ట్ కోసం ఒక్కటే ప్రశ్న ప్రేక్షకుల మదిలో ఇంజెక్ట్ చేశారు. అదే..'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు'' అని. అంతే బాహుబలి పార్ట్ 2 జాతీయ స్థాయిలోనే కాకుండా, విదేశాలలోనూ భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఏ సినిమా వచ్చినా బాహుబలి తరువాతి స్థానమే తప్ప ఆ స్థానాన్ని కనీసం టచ్ చేసే పరిస్థితీ లేదు. సరిగ్గా అలాంటి బుల్లి బాహుబలి ''కార్తీకదీపం'' సీరియల్. బుల్లితెర మీద 740 ఎపిసోడ్లు దాటి జాతీయ స్థాయిలో టీఆర్పీ రేటింగుల్లో ఆదరగోట్టేస్తోంది ఈ సీరియల్. ఒకే పాయింట్.. దీపక్క..డాక్టర్ బాబులు ఎప్పుడు కలుస్తారు? అనే చిన్న సస్పెన్స్ కోసం రోజుల తరబడి సీరియల్ ను మిస్ కాకుండా చూసేస్తున్నారు ఇంటిల్లపాదీ.


భారతీయ సగటు మహిళకు ప్రతిరూపం దీప.. సాధారణ మగాళ్ళ ఆలోచనలకు ఏమాత్రం భిన్నంగా ఆలోచించలేని డాక్టర్ బాబు వీరిద్దరి వివాహం.. విడిపోవడం.. ఇప్పుడు వీరిద్దరూ కలవాలని ప్రతి ప్రేక్షకుడూ కోరుకోవడం ఇవీ 'కార్తీకదీపం' గురించి మూడుముక్కల్లో చెప్పాల్సిన అంశాలు. ఇక ఈ దీపంలో ప్రధాన పాత్ర వంటలక్క అదేనండీ దీపక్క. ఈ పాత్ర కర్ణాటకకు చెందిన ప్రేమీ విశ్వనాద్ చేస్తున్నారు. సీరియల్ చూస్తున్న ప్రేక్షకులను తన నటనతో మెస్మరైజ్ చేస్తున్నారు. ఎంతలా అంటే.. చాల చోట్ల దీపక్క పేరుతొ, వంటలక్క పేరుతొ హోటళ్ళు వెలిశాయి. ఈ ఒక్కటి చాలు దీపక్క క్రేజ్ గురించి చెప్పడానికి.


రాత్రి 7:30 గంటలైందంటే చాలు ప్రతి ఇంటిలోనూ దీపం వెలిగించినా లేకపోయినా.. కార్తీకదీపం సీరియల్ మాత్రం టీవీల్లో మోగిపోతుంది. ఈ సీరియల్ క్రేజ్ గురిచి ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఈ క్రేజ్లో సింహభాగం దీపక్కదే. ఇప్పుడు దీపక్క బుల్లితెర సూపర్ మెగా స్టార్. అవును.. కార్తీకదీపం సీరియల్ వచ్చేటప్పుడు మన మెగా..సూపర్ స్టార్ల సినిమాలు ప్రశారం అయినా ఎవరూ వాటివైపు కన్నెత్తి కూడా చూడటం లేదని టీఆర్పీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కార్తీకదీపం ప్రతి రోజూ ప్రేక్షకులు ఊహించని కొత్తదనాన్ని ఇస్తూనే వస్తోంది. ఈ క్రేజ్ ఎంత అంటే..దీప పాత్రలో ఉన్న ప్రేమీ విశ్వనాద్ కి ఇప్పుడు ఆఫర్ల వెల్లువ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆమె రెమ్యునరేషన్ కూడా అమాంతం పెరిగిపోయింది. దీపక్క కోసం ఎన్నో ఛానల్స్ ఫ్యాన్సీ ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆమె రెమ్యునరేషన్ భారీగా పెంచేసినట్టు టాక్ వినిపిస్తోంది. బాగా అంటే.. ఈ సీరియల్ ప్రారంభం అయ్యే ముందు వారం రోజుల కోసం దీపక్కకి ఇచ్చిన రెమ్యునరేషన్ ఇప్పుడు ఒక్కరోజుకు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు.


ఈ భారీ ఖర్చును తట్టుకోలేక దీపక్కను మార్చి..ఇంకోదీపక్కను తీసుకురావాలని నిర్వాహకులు ప్రయత్నాలూ చేశారట. అయితే,ప్రేక్షకులలో వచ్చే వ్యతిరేకతను తట్టుకునే పరిస్థితి లేక మానేశారని చెప్పుకుంటున్నారు. ఒక సీనియర్ పాప్యులర్ సినీ నటిని దీపక్కగా తీసుకువచ్చేందుకు నిర్వాహకులు గట్టిగానే ప్రయత్నించారట.దానికి ఆ నటి కూడా రెడీ అయ్యారని, అయితే, వంటలక్కగా ప్రేమీ విశ్వనాద్ కు ఉన్న క్రేజ్ గమనించిన నిర్వాహకులు ఆ ప్రయత్నాన్ని విరమించారానీ చెప్పుకుంటున్నారు. ప్రేమీ అడిగినంత ఇస్తూ ఆమెనీ కంటిన్యూ చేయాలనీ కార్తీకదీపం నిర్వాహకులు ఫిక్స్ అయ్యారని తెల్సింది. సో, కార్తీకదీపం మరో నలుగైదేళ్ళు కచ్చితంగా లాగేస్తారు. దానిలో దీపక్క కూడా ఇలానే అందర్నీ అలరిస్తూనే ఉంటుంది. ఇప్పటికే రకరకాలుగా ప్రేమే విశ్వనాద్ ను మార్చేస్తారన్న వార్తలతో షాక్ లో ఉన్న దీపక్క అభిమానులకు కంగారు పడాల్సిన పనేమీ లేదన్న మాట.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories