టైగర్ పక్కన తేజూ బ్యూటీ

బ్రెజిలియన్ మోడల్ లారిస్సా బొనేసి సాయి ధరమ్ తేజ్ హీరోగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'తిక్క' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

Ruthvik
Published on: 24 Jan 2019 8:45 AM IST
టైగర్ పక్కన తేజూ బ్యూటీ
X

బ్రెజిలియన్ మోడల్ లారిస్సా బొనేసి సాయి ధరమ్ తేజ్ హీరోగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'తిక్క' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆమె అందచందాలతో ప్రేక్షకులను మైమరపించినప్పటికీ తెలుగులో అంతగా ఆఫర్లు దక్కించుకోలేకపోయింది. ఈ మధ్యనే తమన్నా, సందీప్ కిషన్ మరియు నవదీప్ ముఖ్య పాత్రలో బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ దర్శకత్వం వహించిన 'నెక్స్ట్ ఏంటి' సినిమాలో కనిపించింది. అయితే ఇప్పుడు ఈమె బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తో ఒక వీడియో సాంగ్ లో కనిపించనుంది.

'ఎయిట్ పీఎం' అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ వీడియో ప్రోమో ఇప్పటికే ఇంటర్నెట్లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో అద్భుతంగా డాన్స్ చేసే హీరోలలో ఒకరు టైగర్ ష్రాఫ్. మైఖేల్ జాక్సన్ స్టెప్పులను సైతం అలవోకగా చేయగల హీరో తో పోటీపడి డాన్స్ చేయడం కష్టమనే చెప్పుకోవాలి. మరి టైగర్ పక్కన డాన్స్ చేస్తూ లారిస్సా ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. ఈ పాట వీడియో ఫిబ్రవరి ఒకటో తారీకు న విడుదల కానుంది.

Ruthvik

Ruthvik

Next Story