గేర్ మార్చి బండి తియ్.. సుశాంత్ కొత్త లుక్ అదుర్స్!

గేర్ మార్చి బండి తియ్.. సుశాంత్ కొత్త లుక్ అదుర్స్!
x
Highlights

Ichata Vaahanamulu Nilupa Raadhu : యంగ్ హీరో సుశాంత్ తాజాగా నటిస్తున్న చిత్రం.. "ఇచ్చట వాహ‌న‌ములు నిలుప‌రాదు".. నో పార్కింగ్ అనేది క్యాప్షన్‌.

Ichata Vaahanamulu Nilupa Raadhu : యంగ్ హీరో సుశాంత్ తాజాగా నటిస్తున్న చిత్రం.. "ఇచ్చట వాహ‌న‌ములు నిలుప‌రాదు".. నో పార్కింగ్ అనేది క్యాప్షన్‌. య‌దార్ధ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమాని తెర‌కెక్కస్తున్నారు. హీరోగా సుశాంత్ కి 7 వ చిత్రం కావడం విశేషం.. ఈ చిత్రాన్ని ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ రోజు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా మూవీ నుంచి సుశాంత్ కొత్త పోస్టర్‌ను చిత్రం బృందం విడుద‌ల చేసింది. ఈ కొత్త పోస్టర్ లో సుశాంత్ రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ మోటార్ బైక్‌పై స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. పోస్టర్‌పై "గేర్ మార్చి బండి తియ్" అనే కొటేషన్ రాసి పెట్టారు. ఈ సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి..



అక్కినేని మూడో తరం కథానాయకుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు సుశాంత్ .. మొదటిసారిగా 2008 లో కాళీదాసు అనే చిత్రంలో నటించాడు. ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. ఆ తర్వాత కరెంట్ అనే చిత్రంలో నటించాడు సుశాంత్.. ప్యూర్ లవ్ స్టొరీగా తెరకెక్కిన ఈ సినిమా సుశాంత్ కి మంచి హిట్టును ఇచ్చింది. ఆ తర్వాత చేసిన అడ్డా, ఆటాడుకుందాంరా సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి.

ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సుశాంత్ సినిమాలకి బ్రేక్ ఇచ్చి కథలు వింటూ వచ్చాడు. ఈ క్రమంలో హీరో నుంచి దర్శకుడిగా మారినా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో చి.ల.సౌ అనే సినిమాని చేసి మంచి హిట్టు కొట్టాడు. డిసెంట్ ఫిలింగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమా తర్వాత సుశాంత్ కి మంచి పేరు వచ్చింది. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ కథానాయకుడిగా వచ్చిన అల‌.. వైకుంఠ‌పుర‌ములో గెస్ట్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories