'ఎన్టీఆర్ మహనాయకుడు' లో కొత్త ఎన్టీఆర్

ఎన్టీఆర్ మహనాయకుడు లో కొత్త ఎన్టీఆర్
x
Highlights

ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా ప్రేక్షకులను మెప్పించలేక పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ...

ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా ప్రేక్షకులను మెప్పించలేక పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ యువకుడిగా కనిపించే పాత్రలో బాలయ్య అస్సలు సూట్ అవ్వలేదు అని చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయం బాలకృష్ణ మరియు దర్శకుడు క్రిష్ చెవిన కూడా పడింది. ఇప్పుడు వీరిద్దరు 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాలో ఈ తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తున్నారట.

'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమా ముఖ్యంగా ఎన్టీఆర్ రాజకీయ జీవితం పైన దృష్టి పెట్టనున్నప్పటికీ ఈ సినిమాలో కూడా కొన్ని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ఉన్నాయట. అందులో ఎన్టీఆర్ కాలేజీ రోజులు మరియు బసవతారకంతో వివాహం ఇలాంటి సన్నివేశాలలో ఎన్టీఆర్ పాత్రలో యువ నటుడిని తీసుకున్నట్టు సమాచారం. అయితే మొదటి భాగంలో బాలయ్య ని చూపించి రెండవ భాగంలో కొత్త నటుడిని చూపిస్తే కంటిన్యూటీ మిస్ అవుతుందేమో అని కొందరు ఇండస్ట్రీ పెద్దల వాదన. మరి క్రిష్, బాలయ్య ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో వారికే తెలియాలి. ఇక ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories