రెండో షెడ్యూల్ లో దుమ్ము దులపనున్న ఎన్టీఆర్

Jr NTR
x
Jr NTR
Highlights

ప్రపంచవ్యాప్తంగా 'బాహుబలి' సాధించిన ఘనవిజయం తరువాత జక్కన్న రాజమౌళి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో ఒక పెద్ద మల్టీ స్టారర్ సినిమా 'ఆర్ ఆర్ ఆర్' తో మన ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

ప్రపంచవ్యాప్తంగా 'బాహుబలి' సాధించిన ఘనవిజయం తరువాత జక్కన్న రాజమౌళి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో ఒక పెద్ద మల్టీ స్టారర్ సినిమా 'ఆర్ ఆర్ ఆర్' తో మన ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. సంక్రాంతి తర్వాత నుండి ఈ సినిమా రెండవ షెడ్యూల్ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఇప్పటికే హైదరాబాద్ శివార్లలో ఒక అద్భుతమైన సెట్‌ను చిత్రబృందం రెడీ చేసింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సెట్ లో ఎన్టీఆర్ పై కొన్ని యాక్షన్ సీన్లు షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ సరికొత్త లుక్తో కనిపిస్తాడట. అలానే కొన్ని అగ్రేసివ్ యాక్షన్ సీన్లు ఈ షెడ్యూల్లో పూర్తి కానున్నాయి. సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లు గా ఎవరు నటించనున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories