Money Heist Season 5 Trailer: మనీ హేస్ట్ అభిమానులకు గుడ్ న్యూస్

Sandeep Reddy
Published on: 3 Aug 2021 12:31 PM IST
Netflix Released Money Heist Season 5 Trailer in Youtube On 3rd August 2021
X

మనీ హేస్ట్ (ట్విట్టర్ ఫోటో)

Money Heist Season 5 Trailer: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మనీ హేస్ట్ అభిమానులకు సీజన్ 5 ట్రైలర్ ని నెట్ ఫ్లిక్స్ ఆగష్టు 2న విడుదల చేసింది. విడుదలైన కొద్దిసేపటికే మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతుంది ఈ ట్రైలర్. మొదటి నాలుగు సీజన్లతో నెట్ ఫ్లిక్స్ లో ఇంటర్నెట్ మొబైల్ డేటా బేస్ (ఐఎమ్డిబి), రోటేన్ టొమాటో వంటి పలు రేటింగ్ సైట్స్ నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా ప్రశంసలు అందుకొని మంచి రేటింగ్ సాధించి నెట్ ఫ్లిక్స్ లో హేస్ట్ కి సంబంధించిన వెబ్ సిరీస్ లోనే మొదటి స్థానంలో నిలిచింది మనీ హేస్ట్.

ఇక ఇప్పటికే ప్రొఫెసర్ పాత్రతో అల్వరో మర్టో తో పాటు రాకేల్ మరిల్లో, టోక్యో, బెర్లిన్, రియో, డెన్వర్, బోగట్టా, మాస్కో వంటి పలు పాత్రలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఈ నాలుగు ఏళ్ళలో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ లో రాకేల్ ప్రొఫెసర్ కు మధ్య జరిగే కొన్ని సన్నివేశాలతో కలిసి పని చేస్తుందా లేదా..? ప్రొఫెసర్ టీం తమ చివరి హేస్ట్ ని విజయవంతంగా పూర్తి చేస్తుందో లేదో తెలియాలంటే సెప్టెంబర్ 3 వరకు ఆగాల్సిందే..


Sandeep Reddy

Sandeep Reddy

Next Story