సుశాంత్ కేసు : శ్రద్ధాకపూర్‌, సారా‌కు సమన్లు

Sara Ali Khan And Shraddha Kapoor : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద కేసులో డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే..

Krishna
Published on: 21 Sept 2020 3:41 PM IST
సుశాంత్ కేసు : శ్రద్ధాకపూర్‌, సారా‌కు సమన్లు
X

Shraddha Kapoor, Sara Ali Khan

Sara Ali Khan And Shraddha Kapoor : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద కేసులో డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.. సుశాంత్ కేసులో మొదటినుంచి A1 నిందితురాలుగా ఉన్న రియా చక్రవర్తిని డ్రగ్స్ కేసులో భాగంగా నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) సెప్టెంబర్ 9 న అరెస్ట్ చేసింది. ఆమెతో పాటుగా ఆమె సోదరుడు షోవిక్‌, శామ్యూల్‌ మెరిండాతోపాటు మరి కొంతమందిని అరెస్టు చేసి, ఎన్‌సీబీ విచారణ చేస్తోంది. దీనితో రియా సెప్టెంబర్ 22 వరకు జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతుంది

అయితే ఎన్‌సీబీ చేసిన విచారణలో భాగంగా రియా చక్రవర్తి 25 మంది సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా వెల్లడించిందని అందులో రకుల్, సారా ఆలీఖాన్ పేర్లు ఉన్నట్టుగా తాజాగా ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ కేపీఎస్‌ మల్హోత్రా అధికారికంగా వెల్లడించారు. వీరితో పాటుగా కొత్తగా నటి శ్రద్ధాకపూర్‌ పేరు కూడా బయటకు వచ్చింది. ఈ క్రమంలో శ్రద్ధాకపూర్‌, సారా అలీఖాన్‌ లకు త్వరలోనే ఎన్‌సీబీ సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్‌డిపిఎస్ చట్టంలోని సెక్షన్ 67 కింద ఇద్దరి నటులకు సమన్లు పంపనుంది. ఇక వీరిద్దరూ గతంలో సుశాంత్ తో నటించినవారే.. శ్రద్ధాకపూర్‌ సుశాంత్ తో చిచ్చోరే అనే సినిమాలో నటించగా, సారా అలీ ఖాన్ కేదార్‌నాథ్‌లో అనే సినిమాలో నటించింది.

ఇక అటు రకుల్ ఈ కేసులో తనని మీడియా ఇబ్బంది పెడుతుంది అంటూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది.. మీడియాలో తనపైన వస్తున్న కథనాలను వెంటనే నిలిపివేసేలా సమాచారశాఖాకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేసింది. అటు సుశాంత్ జూన్ 14 న ముంబైలోని తన అపార్ట్మెంట్లో చనిపోయాడు. దీనిపైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసును విడిగా విచారిస్తున్నాయి.

Krishna

Krishna

Next Story