#NBK107: టీజర్‌ వచ్చేసింది.. భయం నా బయోడేటాలోనే లేదురా అంటూ గర్జించిన బాలయ్య..

NBK107 First Hunt Teaser: నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు హంగామా మొదలైంది.

Arun Chilukuri
Published on: 9 Jun 2022 7:35 PM IST
NBK107 First Hunt Teaser Out Now
X

#NBK107: టీజర్‌ వచ్చేసింది.. భయం నా బయోడేటాలోనే లేదురా అంటూ గర్జించిన బాలయ్య..

NBK107 First Hunt Teaser: నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు హంగామా మొదలైంది. ఒక్కరోజు ముందుగానే ఆయన అభిమానులకు ఓ కానుక అందింది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు టైటిల్‌ ఖరారుకాని సినిమా #NBK107 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతోంది. జూన్‌ 10న బాలకృష్ణ జన్మదినం సందర్భంగా చిత్రబృందం ఆ మూవీ టీజర్ విడుదల చేసింది. ఇందులోని బాలకృష్ణ ఆహార్యం, ఆయన చెప్పిన డైలాగ్స్ ఆయన అభిమానులతోపాటు ప్రేక్షకుల్ని మరింతగా ఆకట్టుకుంటున్నాయి. పులిచర్ల నేపథ్యంలో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రచార చిత్రాన్ని చూస్తుంటే హిట్ గ్యారంటీ అన్న టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ టీజర్‎లో ఆశించినట్లుగానే అన్ని కమర్షియల్‌ హంగులు ఈ సినిమాలో ఉన్నట్లు చెబుతున్నారు ఆయన అభిమానులు. శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్న ఈచిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌, దునియా విజయ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ మ్యూజిక్ అందిస్తుంటే ఇక సాయిమాధవ్‌ బుర్రా మాటలు, రామ్‌లక్ష్మణ్‌ ఫైట్స్, ఎ.ఎస్‌. ప్రకాశ్‌ ప్రొడక్షన్‌డిజైన్‌ చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story