NBK 106 Update: ఫ్యాన్స్ ఖుషీ : బాలయ్య , బోయపాటి సినిమాకి ఆ సెంటిమెంట్!

NBK 106 Update: ఫ్యాన్స్ ఖుషీ : బాలయ్య , బోయపాటి సినిమాకి ఆ సెంటిమెంట్!
x
Balakrishna (File Photo)
Highlights

NBK 106 Updates: హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

NBK 106 Updates: హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన సింహా లెజెండ్ సినిమాలు ఎంత ఘనవిజయం సాధించాయో అందరికీ తెలిసిందే. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం రూపొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే .. ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బోయపాటి మరోసారి బాలయ్య ని ఫుల్ మాస్ యాంగిల్ లో చూపిస్తున్నాడన్నది ప్రేక్షకులకి అర్ధం అయిపోయింది.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఓ సెంటిమెంట్ బాలయ్య ఫ్యాన్స్ ని తెగ ఖుషి చేస్తుంది. ఇంతకీ అది ఏంటంటే.. 1983 లో బాలకృష్ణ హీరోగా చేసిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.. ఇక 1984లో బాలయ్య పూర్తిస్థాయి హీరోగా మారారు. అప్పటి నుంచి ఆయన నటించిన సినిమాలు ప్రతి కాలెండర్ ఇయర్‌లో ఒక్కటైనా విడుదలవుతూ వస్తున్నాయి. మళ్లీ 2013 వ సంవత్సరంలో బాలయ్య సినిమా విడుదల కాలేదు.. ఆ తర్వాత 2014లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన 'లెజెండ్' మూవీ భారీ విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా తరువాత బాలయ్య ప్రతి సంవత్సరం ఒక్కో సినిమా విడుదల చేసుకుంటూ వస్తున్నారు. మళ్లీ 2020 లో బాలయ్య సినిమాలకి బ్రేక్ పడింది.. ఇక సెకండ్ జీరో రిలీజ్ తర్వాత వస్తోన్న చిత్రానికి కూడా బోయపాటి శ్రీను దర్శకుడు కావడం విశేషం. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.. దీనితో లెజెండ్ ఈ సినిమా లాగే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు.

ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి మామూలు పాత్ర కాగా ఇంకోటి అఘోర పాత్ర.. ఇందులో బాలయ్య సరసన అంజలి హీరోయిన్ గా నటిస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories