Nayanthara: అతనితో కలిసి చెన్నైలోనే ఉండనున్న నయనతార

* చెన్నైలోని పోయస్‌ గార్డెన్‌లో ఓ ఖరీదైన ఇంటిని ఆమె కొనుగోలు చేశారట.

Shilpa
Published on: 27 Nov 2021 6:18 PM IST
Nayanthara Buys a New House at Poes Garden for Living with her Husband in Chennai
X

నయనతార - విఘ్నేష్ శివం (ఫోటో- ది హన్స్ ఇండియా) 

Nayanthara: వరుస ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న నటి నయనతార కథానాయికగానే కాకుండా తనకు కాబోయే భర్త విఘ్నేశ్‌శివన్‌తో కలిసి కొన్ని సినిమాలకు నిర్మాతగానూ ఆమె వ్యవహరిస్తున్నారు.

తాజాగా నయనతారకు సంబంధించిన ఓ విషయం కోలీవుడ్‌లో ఒక సమాచారం కోలీవుడ్ లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం చెన్నై నగరంలోని ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో ఉంటోన్న నయనతార కొత్త ఇంటికి మారుతున్నట్టు సమాచారం. చెన్నైలోని పోయస్‌ గార్డెన్‌లో ఓ ఖరీదైన ఇంటిని ఆమె కొనుగోలు చేశారట.

నాలుగు పడక గదులతో ఉన్న ఈ ఇంటి కోసం నయన్‌ పెద్దమొత్తంలో ఖర్చు పెట్టారని, త్వరలోనే విఘ్నేశ్‌ శివన్‌తో కలిసి ఆమె గృహప్రవేశం చేయనున్నారని సమాచారం. ఇదే ప్రాంతంలో ఆమె త్వరలోనే మరో ఇంటిని సైతం కొనుగోలు చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్లు పలు పత్రికల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే నయన్‌-విఘ్నేశ్‌ వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోనున్నారని సమాచారం‌. వివాహం తర్వాత వాళ్ళిద్దరు నివసించటం కోసం అక్కడ కొత్త ఇంటికి కొనుగోకు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే వీళ్లిద్దరికీ నిశ్చితార్థమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నయనతార తెలుగులో తెరకెక్కుతోన్న 'గాడ్‌ ఫాదర్‌', తమిళంలో 'కాతువక్కుల రెందు కాదల్‌', 'కనెక్ట్‌' చిత్రాల్లో నటిస్తున్నారు.

Shilpa

Shilpa

Next Story