శ్యామ్ సింగరాయి సినిమా రెమ్యునిరేషన్ వెనక్కి ఇచ్చేసిన నాని...

Nani - Shyam Singh Roy: "జెర్సీ" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని తరువాత వరుస డిజాస్టర్తో సతమతమయ్యాడు...

admin1
Updated on: 30 Dec 2021 7:30 PM IST
Natural Star Nani Returned the Shyam Singha Roy Remuneration | Tollywood Latest News
X

శ్యామ్ సింగరాయి సినిమా రెమ్యునిరేషన్ వెనక్కి ఇచ్చేసిన నాని...

Nani - Shyam Singh Roy: "జెర్సీ" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని తరువాత వరుస డిజాస్టర్తో సతమతమయ్యాడు. "గ్యాంగ్లీడర్", "వి", "టక్ జగదీష్" వంటి సినిమాలన్నీ అంచనాలను అందుకోలేక పోయాయి. ఇక తాజాగా విడుదలైన శ్యామ్ సింగరాయి సినిమాతో ఎట్టకేలకు మంచి హిట్ అందుకున్నాడు నాని. అయితే ఈ సినిమా విడుదలకు ముందు చాలా తతంగమే జరిగింది.

ఇంకా చెప్పాలంటే ఈ సినిమాని విడుదల చేయడానికి నాని మరియు నిర్మాతలు చాలానే ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ సినిమా కోసం నిర్మాతలు 55 కోట్ల బడ్జెట్ ను పెట్టారు. అయితే ఆంధ్రప్రదేశ్లో టిక్కెట్ల రేట్లు పడిపోవడంతో సినిమా కలెక్షన్లపై అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఇవి చాలవన్నట్టు నాని చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, అతనిపై నెగిటివిటీ కూడా పెరిగిపోవటం సినిమా విడుదలకు ఆటంకాలు గా మారాయి.

డిసెంబర్ 24 దాకా సినిమా విడుదల అవుతుందా లేదా అని కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నాని తన రెమ్యూనరేషన్ 8 కోట్ల నుంచి ఐదు కోట్ల ని వెనక్కి తిరిగి ఇచ్చేశారట. అప్పటికే "వి", "టక్ జగదీష్" వంటి రెండు సినిమాలని ఓటీటీ లకి ధారాదత్తం చేసిన నాని ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోనే విడుదల చేయాలని సంకల్పించుకున్నారు.

అందుకోసమే రెమ్యునరేషన్ కూడా వెనక్కి ఇచ్చి నిర్మాతలని థియేటర్లలో సినిమాని విడుదల చేయమని కోరారు. అయితే నిర్మాతలని ఆదుకోవడం కోసం ఇలాంటి డేరింగ్ స్టెప్ లను తీసుకునే హీరోలు టాలీవుడ్ లో చాలా తక్కువనే చెప్పాలి. ఇన్ని ఆటంకాల మధ్య విడుదలైన "శ్యామ్ సింగరాయి" ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటోంది.

admin1

admin1

Next Story