Anushka Shetty: అనుష్క-నానీ.. ఒకరికి ఒకరు!

Anushka Shetty: అనుష్క-నానీ.. ఒకరికి ఒకరు!
x
anushka in nishabdham
Highlights

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటీనటులంతా చాలా స్నేహంగా ఉంటారు. టాలీవుడ్ ను అదే మిగిలిన ఇండస్ట్రీల కంటే భిన్నంగా ఉంచుతోంది. అదేవిధంగా చాలామంది హీరో, హీరోయిన్...

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటీనటులంతా చాలా స్నేహంగా ఉంటారు. టాలీవుడ్ ను అదే మిగిలిన ఇండస్ట్రీల కంటే భిన్నంగా ఉంచుతోంది. అదేవిధంగా చాలామంది హీరో, హీరోయిన్ లు కుటుంబ సభ్యుల్లా కలిసిపోతారు. ఒకరి విజయాన్ని మరొకరు ఎంజాయ్ చేస్తారు. తమకు ఇష్టమైన వారు విజయాలు సాధించాలని చూస్తారు. వారికోసం ఏదైనా చేయడానికి ముందుకు వస్తారు. ఇప్పుడిదంతా ఎందుకంటే, టాలీవుడ్ లో నాచురల్ స్టార్ నానీ, స్వీటీ అనుష్కల స్నేహ బంధం గురించి చెప్పడానికే.

ఇటీవల నానీ నిర్మించిన హిట్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అనుష్క వచ్చి సినిమా ప్రమోషన్ లో భాగం పంచుకున్నారు. ఈ సందర్భంగా నానీ అనుష్క తమ కుటుంబ సభ్యురాలని చెప్పారు. అదేవిధంగా అనుష్క మాట్లాడుతూ తన కుటుంబంలో ఒకడైన నానీ నిర్మించిన హిట్ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నానంటూ మాట్లాడారు. అనుష్క నానీ సినిమాకి ఈ విధంగా ప్రచారం చేశారు.

ఇప్పుడు నానీ వంతు వచ్చింది. అనుష్క హిట్ సినిమా ప్రచారానికి చేసిన సహాయానికి రిటన్ గిఫ్ట్ యిచ్చే ఛాన్స్ వెంటనే వచ్చేసింది. అనుష్క నటించిన 'నిశ్శబ్దం' సినిమా విడుదలకు సిద్ధం అయింది. ఇప్పుడు ఈ సినిమాని నానీ ప్రమోట్ చేయబోతున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో బహుభాషా చిత్రంగా రూపొందిన 'నిశ్శబ్దం' ట్రైలర్ ఈ నెల ఆరో తేదీన లాంచ్ చేయబోతున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 12:12 గంటలకు నానీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. సో, స్వీటీ తనకు చేసిన సహాయానికి నానీ ఈ విధంగా బదులు తీర్చుకుంటున్నారన్న మాట.

ఇక నిశ్శబ్దం సినిమా విశేషాల కొస్తే.. అనుష్క ప్రధాన పాత్రలో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయింది. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు అన్ని నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో అంటే ఏప్రిల్ 2 న ఈ నిశ్శబ్దం విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు నానీ.

మాటలు రాని అమ్మాయిగా అనుష్క నటించిన ఈ సినిమాలో మాధ‌వ‌న్‌, అంజ‌లి, షాలిని పాండే, సుబ్బరాజ్‌, శ్రీనివాస్ అవ‌స‌రాల నటిస్తుండగా హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్‌సన్ విలన్‌గా నటిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories