ఆర్జీవి పై షాకింగ్ కామెంట్స్ చేసిన నట్టి కుమార్

*రోజురోజుకు పెరుగుతూ వస్తున్న ఆర్జీవి నట్టికుమార్ ల గొడవ

Rama Rao
Updated on: 30 May 2022 4:42 PM IST
Natty Kumar Comments on Director Ram Gopal Varma | Tollywood News
X

రోజురోజుకు పెరుగుతూ వస్తున్న ఆర్జీవి నట్టికుమార్ ల గొడవ

RGV Vs Natty Kumar: గత కొంత కాలంగా రామ్ గోపాల్ వర్మ సినిమా బడ్జెట్ ప్యాకేజీల విషయంలో వస్తున్న వివాదాలు అందరికీ తెలిసిందే. వర్మ తనని నమ్మించి మోసం చేసి ఇవ్వాల్సిన 50 లక్షలు తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని శేఖర్ రాజు అనే ఒక వ్యక్తి రామ్ గోపాల్ వర్మ పై కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో నట్టికుమార్ కూడా ముందుకు వచ్చి తనకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వటం లేదు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

అయితే తాజాగా నట్టికుమార్ కి ఊహించని షాక్ తగిలింది. తన సంతకం ఫోర్జరీ చేసి తప్పుడు పత్రాలు సృష్టించి అడ్డంగా మోసం చేశారు అంటూ రాంగోపాల్ వర్మ నిర్మాతలు నట్టికుమార్, క్రాంతి లపై పంజాగుట్ట స్టేషన్ లో కేసు నమోదైంది.ఈ నేపథ్యంలో నట్టికుమార్ వర్మ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న డేంజరస్ సినిమాని తెలుగులో "మా ఇష్టం" అని టైటిల్ తో చేద్దామనుకున్నారు.

కానీ నట్టికుమార్ ఆరోపణల తర్వాత సినిమా పై కోర్టు స్టే విధించింది.దీంతో ఆగ్రహానికి గురైన రాంగోపాల్ వర్మ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నట్టికుమార్ మాట్లాడుతూ "ఆర్జీవి ఒక 420. ఎప్పుడూ తప్పుడు కేసులు పెడుతూ ఉంటాడు. కానీ నా పిల్లలు జోలికి వస్తే వదిలిపెట్టను. ప్రస్తుతం కోర్టులో వివాదం నడుస్తోంది ఆర్జీవి జీరో అయిపోయాడు" అంటూ కామెంట్లు చేశారు నట్టికుమార్.

Rama Rao

Rama Rao

Next Story