మరో వివాదంలో చిక్కుకున్న రామ్‌ గోపాల్ వర్మ.. రూ.5కోట్ల 29 లక్షలు ఇవ్వాలని కేసు...

RGV vs Natti Kumar: థియేటర్స్ సపోర్ట్ చేయకపోవడంతో సినిమా వాయిదా అంటూ వర్మ ట్వీట్...

Shireesha
Published on: 8 April 2022 8:08 AM IST
Natti Kumar Filed Case Against Ram Gopal Varma | RGV vs Natti Kumar
X

మరో వివాదంలో చిక్కుకున్న రామ్‌ గోపాల్ వర్మ.. రూ.5కోట్ల 29 లక్షలు ఇవ్వాలని కేసు...

RGV vs Natti Kumar: సెన్షెనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరో వివాదంలో చిక్కుకున్నాడు. నిర్మాత నట్టి కుమార్.. ఆర్జీవీపై కేసు వేసిన సంగతి తెలిసిందే. తనకు రూ. 5 కోట్లు వర్మ చెల్లించాల్సి ఉందని, వాటిని ఇవ్వమని అడగగా వర్మ పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన డబ్బులు చెల్లించేవరకు ఆర్జీవీ తీసిన సినిమా మా ఇష్టం విడుదల కాకుండా చూడాలని నట్టి కుమార్ కోర్టులో కేసు వేశాడు. ఇక దీంతో కోర్టు మా ఇష్టం సినిమా విడుదల కాకుండా స్టే విధించింది.

ఇక వర్మ గురించి నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. " రామ్ గోపాల్ వర్మ పెద్ద మోసగాడని నట్టి కుమార్ అన్నారు. తనకు 5 కోట్ల 29 లక్షలు ఇవ్వాలని తెలిపారు. ఎప్పుడు డబ్బులు అడిగిన రెస్పాన్స్ అవ్వడని ఆరోపించారు. రామ్ గోపాల్ వర్మ తో 20 సంవత్సరాలు కలిసి పని చేశానన్నారు. సినిమా తీస్తాడు డబుల్ అగ్రీమెంట్ వేరే వాళ్లకు చేస్తాడు. ఇలా నన్ను ఒక్కడినే కాదు చాలామందిని మోసం చేశాడని నట్టికుమార్ ఆరోపించారు.

ఇదిలా ఉండగా థియేటర్లు సహకరించకపోవడంతో తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నామంటూ ఆర్జీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. సినిమా విడుదలపై కోర్ట్ స్టే ఇవ్వడంతో.. రిలీజ్ పై వెనకడుగు వేశారు వర్మ. " మా ఇష్టం సినిమా విడుదల విషయం లో లెస్బియన్ సబ్జెక్ట్ మూలాన చాలా థియేటర్స్ సపోర్ట్ చేయడం లేదని అందుకని సినిమా విడుదల పోస్ట్ పోన్ చేస్తున్నామన్నారు. అన్ని విధాలుగా ఈ అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలో పరిశీలించి తగు చర్యలు తీసుకున్నా తరువాత మరో రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామన్నారు వర్మ.


Shireesha

Shireesha

Next Story