మళ్లీ నిర్మాతగా మారనున్న నాని

Ruthvik
Published on: 15 Feb 2019 12:26 PM IST
మళ్లీ నిర్మాతగా మారనున్న నాని
X

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన శైలిలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి ఎదిగిన స్టార్ నాచురల్ స్టార్ నాని. ఎప్పటికైనా దర్శకుడు అవ్వాలని టాలీవుడ్లో అడుగుపెట్టిన నాని ఇప్పుడు హీరోగా సెటిల్ అయ్యాడు. అంతేకాక నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ మధ్యనే ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన 'అ!' సినిమా తో నిర్మాతగా మారాడు నాని. ఇక హీరో గానే కాక నిర్మాతగా కూడా తన కెరీర్ లో ముందుకు వెళుతున్నాడు.

ఈ మధ్యనే దిల్ రాజు తో కలిసి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించనున్న సినిమాకి సహా నిర్మాతగా వ్యవహరించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం నాని మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకి నిర్మాణ బాధ్యతలు స్వీకరించనున్నాడు. నాని హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన 'భలే భలే మగాడివోయ్' సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ మారుతి దర్శకత్వం వహించనున్న సినిమాకు నిర్మాత అవ్వనున్నాడు నాని. మరి ఈ సినిమాలో హీరో ఎవరు మరియు ఇతర వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Ruthvik

Ruthvik

Next Story