ఆకట్టుకుంటున్న నానీ గ్యాంగ్ లీడర్ కొత్తపాట

ఆకట్టుకుంటున్న నానీ గ్యాంగ్ లీడర్ కొత్తపాట
x
Highlights

గ్యాంగ్ లీడర్ ఈ టైటిల్ పవర్ అందరికీ తెలిసిందే. నానీ ఈ పవర్ ని మరింత పవర్ ఫుల్ గా చూపించడానికి సిద్ధం అయిపోతున్నారు. హోయన్న..హోయన్నా సాంగ్ రిలీజ్.

గ్యాంగ్ లీడర్ ఈ టైటిల్ పవర్ అందరికీ తెలిసిందే. నానీ ఈ పవర్ ని మరింత పవర్ ఫుల్ గా చూపించడానికి సిద్ధం అయిపోతున్నారు. రైటర్ పెన్సిల్ పార్థసారథిగా నాలుగు విభిన్న వయసున్న ఆడవారితో సందరి చేయబోతున్నారు నానీ. వాళ్ళ గ్యాంగ్ లీడర్ గా నానీ ఏం చేశాడో చూడాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. ఈ నేపధ్యంలో ఇటీవల తీజర్ విడుదల చేశారు. అది అందర్నీ ఆకట్టుకుంది. అదే విధంగా రారా అంటూ ఒక పాటనూ విడుదల చేశారు. అదీ మంచి స్పందన రాబట్టింది. ఇక తాజాగా హోయన్న.. హోయన్న అంటూ సాగే గీతాన్ని విడుదల చేశారు నానీ. ఈ చిత్ర ఆడియో హక్కులను సొంతం చేసుకున్న సోనీ మ్యూజిక్ తన సౌత్ యూట్యూబ్ ఛానెల్‌లో ఈ పాట లిరిక్ వీడియోను అప్‌లోడ్ చేసింది.

అనిరుద్ సంగీతంలో అనంత శ్రీరాం రాసిన ఈ పాట ఆకట్టుకుంటోంది. ఇన్నో గంగ పాటను చాలా మధురంగా పాడారు. పాటకు మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories