Shyam Singha Roy: "శ్యామ్ సింగరాయ్" కథ ఇదేనా?

‍Nani as a Writer in Shyam Singharoy Movie
x

శ్యామ్ సింఘా రాయ్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Shyam Singha Roy: రైటర్ గా నాని చేయనున్నది ఇదేనా?

Shyam Singha Roy: ఈ మధ్యనే తన "టక్ జగదీష్" సినిమాతో పెద్ద డిజాస్టర్ ని అందుకున్న నాని ప్రస్తుతం తన ఆశలన్నీ తన తదుపరి సినిమా అయిన "శ్యామ్ సింగరాయ్" పైనే పెట్టుకున్నాడు. నాని కరియర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కనున ఈ సినిమాలో "ఉప్పెన" బ్యూటీ కృతి శెట్టి, "ప్రేమమ్" ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ మరియు సాయి పల్లవి లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. పీరియడ్ బ్యాక్ డ్రాప్ తో సాగనున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఈ సినిమా కథ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిత్ర టీజర్ చూస్తేనే ఈ సినిమాలో నాని ఒక రైటర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలుస్తుంది. అయితే నాని పాత్ర కథలను రాయడంతో పాటు ఆ కథ లో ఉన్న పాత్రల లో తనని తాను ఊహించుకుంటూ ఉంటారట. సినిమా కథ మొత్తం నాని కి ఉన్న ఈ అలవాటు చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 24న విడుదల కాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories