మళ్ళీ బాలయ్యతో రొమాన్స్ చేయనున్న సీనియర్ బ్యూటీ

మళ్ళీ బాలయ్యతో రొమాన్స్ చేయనున్న సీనియర్ బ్యూటీ
x
Highlights

ఈ మధ్యనే ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగమైన 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాతో మన ముందుకు వచ్చిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాతో బిజీగా ఉన్నారు.

ఈ మధ్యనే ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగమైన 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాతో మన ముందుకు వచ్చిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా ఒక కొలిక్కి రాగానే బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను తో కలిసి ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు నయనతార ను హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే బోయపాటి శ్రీను దర్శకత్వం లో 'తులసి', 'సింహా' అనే రెండు సినిమాలు చేసింది నయనతార. ఇక బాలకృష్ణ నయనతార మధ్య ఉండే అద్భుతమైన కెమిస్ట్రీ మనం 'సింహ', 'శ్రీ రామ రాజ్యం' మరియు 'జైసింహా' సినిమా లో చూశాం. అంటే నయనతారకు ఇది బోయపాటి శ్రీను తో మూడో సినిమా అయితే బాలయ్య బాబు తో నాలుగో సినిమా. ఇప్పటికే 'సైరా' సినిమాలో చిరంజీవి పక్కన నటిస్తున్న నయనతార మళ్లీ బాలయ్య తో రొమాన్స్ చేయనుంది. ఈ సినిమాను బాలకృష్ణ తన సొంత ప్రొడక్షన్ పతాకంపై నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories