Namrata Shirodkar: చాలా త్వరగా వెళ్లిపోయావు.. నమ్రత ఎమోషనల్‌ పోస్ట్‌..!

Namrata Shirodkar: చాలా త్వరగా వెళ్లిపోయావు.. నమ్రత ఎమోషనల్‌ పోస్ట్‌..

Arun Chilukuri
Published on: 1 Feb 2023 3:40 PM IST
Namrata Shirodkar Shares Emotional Post Remembering Her Father
X

Namrata Shirodkar: చాలా త్వరగా వెళ్లిపోయావు.. నమ్రత ఎమోషనల్‌ పోస్ట్‌..

Namrata Shirodkar: నటిగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నమ్రత శిరోద్కర్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని పెళ్లి చేసుకున్నాక సినిమాలకి దూరమైంది. సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గా ఉండే నమృత ఎప్పటికప్పుడు పిల్లల గురించి లేదా మహేష్ బాబుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా చనిపోయిన తన తండ్రిని తలచుకుంటూ నమ్రత ఒక ఎమోషనల్ పోస్టు పెట్టారు. '16 ఏళ్లుగా నిన్ను మిస్‌ అవుతూనే ఉన్నా పప్పా.. నీ ప్రతి జ్ఞాపకం నా మదిలో అలాగే ఉండిపోయింది. ఏమీ మారలేదు.. నువ్వు చాలా త్వరగా మమ్మల్ని వదిలేసి పోయావు పప్పా.. అనంతమైన ప్రేమను, వెలుగులను నిత్యం నీకు పంపిస్తూనే ఉంటాను' అని రాసుకొచ్చింది నమ్రత. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story