Nagarjuna: సమంత నాగ చైతన్య విడాకుల పై రియాక్ట్ అయిన నాగార్జున

Nagarjuna: "చై ఒక్క మాట కూడా అనలేదు" అంటున్న నాగార్జున

Rama Rao
Updated on: 22 Jan 2022 8:34 AM IST
Nagarjuna Responds to Samantha Naga Chaitanyas Divorce | Telugu Movie News
X

 సమంత నాగ చైతన్య విడాకుల పై రియాక్ట్ అయిన నాగార్జున 

Nagarjuna: సమంత నాగ చైతన్య విడాకుల పై రియాక్ట్ అయిన నాగార్జునఎంతో అన్యన్యంగా ఉండే టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత మరియు నాగ చైతన్య విడిపోయిన సంగతి అందరికి తెలిసిందే. పెళ్ళైన 4 ఏళ్ల తర్వాత ఈ జంట గతేడాది తమ విడాకుల విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తాజాగా నాగార్జున విడాకుల విషయం పై ఓపెన్ అయ్యారు. వీరి విడాకుల గురించి ఎన్ని పుకార్లు పుట్టుకొచ్చినప్పటికీ ఏ మాత్రం డిస్టర్బ్ అవ్వలేదు. కనీసం ఒక్క మాట కూడా అనలేదు కానీ ప్రతి తండ్రి లాగానే తాను కూడా కొడుకు విషయంలో చాలా భయపడ్డాను అని చెప్పుకొచ్చారు నాగార్జున.

"కానీ తను నా గురించి ఎక్కువ వర్రీ అయ్యేవాడు. తనే నా దగ్గరికి వచ్చి మీరు బానే ఉన్నారా అని అడిగేవాడు. అసలు నేను కదా ఆ మాట అడగాల్సింది అని అనుకునేవాడిని." అని అన్నారు నాగార్జున. ఇక నాగచైతన్య మాట్లాడుతూ తను బాధలో ఉన్నప్పుడు తన కుటుంబ సభ్యుల తనకి అండగా నిలబడ్డారని చెప్పుకొచ్చాడు. అయితే విడాకుల విషయం గురించి నాగార్జున కానీ నాగచైతన్య కానీ బంగార్రాజు ప్రమోషన్లలో ఎక్కువగా రియాక్ట్ అవలేదు. మరోవైపు బంగార్రాజు సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంది.

Rama Rao

Rama Rao

Next Story