అందుకే నాగార్జున కింగ్.. రికార్డులు బద్దలు కొడుతున్న బిగ్ బాస్ 3
నాగార్జునని అందరూ కింగ్ నాగ్ అంటారు. ఎందుకో ఇప్పుడు తెలిసిందా అంటూ టాలీవుడ్ పీఆర్వో బీఎరాజు ట్వీట్ చేశారు. విషయం ఏమిటంటే.. పదిరోజుల క్రితం బిగ్ బాస్ షో ప్రారంభం అయింది. ఈ షో కి హోస్ట్ గా నాగార్జున చేస్తున్నారు.
ఇప్పుడు బిగ్ బాస్ 3 టీఆర్పీ రేటింగ్ లలో నెం1 గా నిలిచింది. నాగార్జున చేసిన బిగ్ బాస్ ౩ మొదటి ఎపిసోడ్ ఆదరగోట్టింది. ఈ తొలి ఎపిసోడ్ 17.92 టీఆర్పీ రేటింగ్ సాధించింది. ఇది ఏ షోకూ ఇప్పటివరకూ రాని రేటింగ్. ఈ విషయాన్ని చెబుతూ నాగార్జునని కింగ్ అని అందుకే అంటారు అంటూ పోస్ట్ చేశారు బీఎరాజు. బిగ్ బాస్ ౩ అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది. బుల్లితెరపై సంచలనంగా నిలుస్తోంది అని అయన ట్వీట్ చేశారు.
King @iamnagarjuna breaks all records of #BigBossTelugu3 with TRP of 17.92 and sets a new bar.
— BARaju (@baraju_SuperHit) August 1, 2019
Called KING for a reason 🙌 @StarMaa pic.twitter.com/1QF74itEcl




