Multistarrer Movie : బాలకృష్ణ, నాగార్జున మల్టీస్టారర్.. అప్పుడు అందుకే వర్కౌట్ కాలేదట!

Multistarrer Movie : నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున ఇద్దరు నట వారుసులు గానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమదైన నటనతో ప్రేక్షకులను

Krishna
Published on: 28 Aug 2020 3:58 PM IST
Multistarrer Movie : బాలకృష్ణ, నాగార్జున మల్టీస్టారర్.. అప్పుడు అందుకే వర్కౌట్ కాలేదట!
X

Akkineni Nagarjuna, Nandamuri Balakrishna

Multistarrer Movie : నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున ఇద్దరు నట వారుసులు గానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమదైన నటనతో ప్రేక్షకులను మెప్పించి స్టార్ హీరోలుగా ఎదిగారు.. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో అప్పుడో మల్టీస్టారర్ సినిమా చేయాలని అనుకున్నారట... అది కూడా ఎదో సినిమా కాదు.. వీరిద్దరి తండ్రులు ఎన్టీఆర్, నాగేశ్వర్ రావు కలిసి నటించిన గుండమ్మ కథకి సీక్వెల్.. అయితే అన్ని పాత్రలకి నటులు దొరికినప్పటికి సుర్యకాంతం పాత్రకి బలమైన నటి కనిపించకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారట.. కనీసం ఎన్టీఆర్, నాగచైతన్య ఈ సినిమాని చేస్తారేమో చూడాలి మరి..

ఇక మరొకసారి సారి హిందీలో హిట్టైయిన 'చుప్కే చుప్కే' సినిమాని తెలుగులో రీమేక్ చేయాలనీ అనుకున్నారట.. దీనికోసం బాలకృష్ణ కథను కూడా సిద్దం చేయించారట.. కానీ ఈ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. చుప్కే చుప్కే సినిమాలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర హీరోలుగా నటించారు. ఇక బాలకృష్ణ, నాగార్జున తండ్రి నాగేశ్వరరావుతో శ్రీరామరాజ్యం సినిమాతో పాటుగా పలు సినిమాల్లో నటించారు. ఇక ఇటు నాగార్జున, బాలకృష్ణ అన్నయ్య హరికృష్ణతో సీతారామరాజు సినిమాలో నటించాడు. ఇలా వారు నటించకపోయిన వారి వారి ఫ్యామిలీ హీరో లతో కలిసి నటించారు..

ఇక ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు.. ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో సింహ, లెజెండ్ సినిమాలు వచ్చాయి.. ఇక నాగార్జున బిగ్ బాస్ షోతో బిజీ గా ఉన్నారు. అంతేకాకుండా వైల్డ్ డాగ్ సినిమాని చేస్తున్నారు నాగ్.. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో మరో సినిమాని చేస్తున్నాడు నాగ్..

Krishna

Krishna

Next Story