Nagarjuna: 100 వ సినిమా ని లైన్ లో పెట్టిన నాగార్జున

‍Nagarjuna 100th Film With Director Mohan Raja | Telugu Movie News
x

 100 వ సినిమా ని లైన్ లో పెట్టిన నాగార్జున

Highlights

Nagarjuna: 100 వ సినిమా ని లైన్ లో పెట్టిన నాగార్జున

Nagarjuna: ఈ మధ్యన "వైల్డ్ డాగ్" సినిమాలో యాక్షన్ పాత్రలో కనిపించిన టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా విడుదలైన బంగార్రాజు సినిమాల్లో మాత్రం ఎంటర్టైనింగ్ పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. "సోగ్గాడే చిన్నినాయన" సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఒక వైపు బిగ్ బాస్ 6 వ సీజన్ ని హోస్ట్ చేస్తున్నా నాగార్జున మరోవైపు వరుస సినిమా షూటింగ్లతో కూడా బిజీగా ఉన్నారు. "ఘోస్ట్" సినిమా అనే ఒక యాక్షన్ థ్రిల్లర్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నాగార్జున తన తాజాగా తన 100 వ సినిమాని సైన్ చేసినట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "గాడ్ ఫాదర్" సినిమాకి దర్శకత్వం వహిస్తున్న మోహన్ రాజా నాగార్జున 100 వ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాని చాలా స్పెషల్ గా ప్లాన్ చేస్తున్న నాగార్జున అక్కినేని అఖిల్ ని ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది. మనం సినిమా తర్వాత మళ్లీ అఖిల్ ఈ సినిమాలో నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు జీ స్టూడియోస్ సినిమానే సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories