ఆయన ఫొటో కోసం పడిగాపులు కాసినోళ్లు కూడా ఆయనపై కారుకూతలు కూస్తున్నారు.. వైసీపీ నేతలపై నాగబాబు ఫైర్..

Naga Babu Konidela: మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ పెద్ద ఎత్తున ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు విరుచుకు పడుతున్నారు.

Arun Chilukuri
Updated on: 9 Aug 2023 5:00 PM IST
Nagababu Strong Counter to Andhra Pradesh Ministers in Twitter
X

ఆయన ఫొటో కోసం పడిగాపులు కాసినోళ్లు కూడా ఆయనపై కారుకూతలు కూస్తున్నారు.. వైసీపీ నేతలపై నాగబాబు ఫైర్..

Naga Babu Konidela: మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ పెద్ద ఎత్తున ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు విరుచుకు పడుతున్నారు. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా ఒక రేంజ్‌లో విరుచుకుపడ్డారు. శ్రమని పెట్టుబడిగా పెట్టి, పన్నుని ప్రభుత్వానికి అనాపైసలతో సహా కట్టి, వినోదాన్ని విజ్ఞానాన్ని జనానికి పంచిపెట్టి, 24 క్రాఫ్ట్ లకి అన్నం పెడుతున్న ఏకైన పరిశ్రమ చిత్రపరిశ్రమ అని నాగబాబు అన్నారు.

ఆంధ్రా మంత్రులు, చిరంజీవి ఫోటో కోసం పడిగాపులు కాసినోళ్లు కూడ ఆయనపై కారు కూతలు కూస్తున్నారన్నారు. మీ బతుక్కి శాఖల మీద అవగాహన ఉండదని...అభివృద్ధి అనేదానికి అర్ధమే తెలియదని నాగబాబు అన్నారు. మీ దుర్మార్గపు పాలనకి END CARD దగ్గర్లోనే ఉందంటూ ట్వీట్ చేశారు. ట్వీట్‌లో చివరన NOTE అని రాసి కాలం గాలమేస్తే ప్రకృతే శత్రువవుతుందని...ఆరోగ్యాలు జాగ్రత్త.! అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story