Nagababu On Niharika : అల్లుడిపై తనదైన స్టైల్ లో కామెంట్స్ చేసిన నాగబాబు...

Nagababu On Niharika : మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది.. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, మెగా ప్రిన్సెస్ నిహారిక నిశ్చితార్ధం నిన్న

Krishna
Published on: 14 Aug 2020 12:30 PM IST
Nagababu On Niharika : అల్లుడిపై తనదైన స్టైల్ లో కామెంట్స్ చేసిన నాగబాబు...
X
Nagababu interesting comments on his daughter niharika

Nagababu On Niharika : మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది.. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, మెగా ప్రిన్సెస్ నిహారిక నిశ్చితార్ధం నిన్న ఆగస్టు 13 (గురువారం) సాయింత్రం జరిగింది. కరోనా నేపద్యంలో జరుగుతున్న వేడుక కావడంతో కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్, అల్లు అర్జున్, ఉపాసన, సురేఖ, శ్రీజ, సుస్మిత భాగమయ్యారు.. అయితే పవన్ కళ్యాణ్ కనిపించకపోవడం గమనార్హం...ఇక నిహారిక నిశ్చితార్ధ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అటు అభిమానులు, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు నిహారికకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక నిహారిక- చైతన్య జంట చాలా బాగుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇది ఇలా ఉంటే నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. 'నా బేబి సిస్టర్ నిశ్చితార్థం చేసుకుంది. వెల్‌కమ్ టు మై ఫ్యామిలీ బావా' అంటూ ట్వీట్ చేశాడు. అటు నాగబాబు ఎమోషనల్ గా పోస్ట్ చేశారు. చాలామంది అంటుంటారు నిహారిక చాలా విషయాల్లో నాలాగే ఉంటుందని. తనపై నువ్వు అపారమైన ప్రేమను కురిపిస్తూ లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటావని బలంగా నమ్ముతున్నాను. ఇకపై అది అధికారికంగా నీ సమస్య" అంటూ కామెంట్స్ చేశారు నాగబాబు..



ఇక నిహారికకి కాబోయే భర్త చైతన్య జొన్నలగడ్డ ఎవరో కాదు.. గుంటూరు పోలీసు శాఖలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్‌ కుమారుడు తన్య ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఎంఎన్‌సి కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు. వచ్చే ఏడాది నిహారిక వివాహం జరగనుందని సమాచారం..

Krishna

Krishna

Next Story