జబర్దస్త్ నుంచి నాగబాబు..చమ్మక్ చంద్ర సైడ్ అయిపోయినట్టే.. మరి అనసూయ, ఆదిల మాటేంటీ?

నాగబాబు, చమ్మక్ చంద్ర, అనసూయ, ఆది నలుగురూ జబర్దస్త్ నుంచి వెళ్ళిపోతారని ప్రచారం జరిగింది. కానీ, నాగబాబు, చమ్మక్ చంద్ర మాత్రమే జబర్దస్త్ ను వీడారు. అనసూయ, ఆది యధావిధిగా రాబోయే ఎపిసోడ్ లలో కనిపించనున్నారు.

K V D Varma
Published on: 22 Nov 2019 11:37 PM IST
జబర్దస్త్ నుంచి నాగబాబు..చమ్మక్ చంద్ర సైడ్ అయిపోయినట్టే.. మరి అనసూయ, ఆదిల మాటేంటీ?
X
Nagababu Leaved Jabardasth Adi, Anasuya continues

కొన్ని రోజులుగా కామెడీ అభిమానుల నోట ఒకటే మాట. జబర్దస్త్ నుంచి నాగబాబు వెళ్ళిపోతున్నారట. దానికి కొనసాగింపు కూడా ప్రచారంలో ఉంది. ఆయనతో పాటూ చమ్మక్ చంద్ర, అనసూయ, ఆది కూడా వెళ్ళిపోతున్నారంటూ. దాదాపు ఏడేళ్లు ఒకటే షో కి న్యాయనిర్ణేతగా వ్యవహరించడం అంటే మాటలు కాదు. ఆ అవకాశం తనకి దక్కిందంటూ చెబుతూ నేను జబర్దస్త్ వదిలేస్తున్నాను అని నాగబాబు తన ఛానెల్ లో క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఆ విషయం క్లియర్ అయిపొయింది.

ఇక చమ్మక్ చంద్ర కూడా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో తాను జబర్దస్త్ వదిలేస్తానని క్లియర్ కట్ గా చెప్పేశారు. అదీ స్పష్టమైపోయింది. మరిక మిగిలింది అనసూయ, ఆది. వీరిద్దరిదీ మాత్రం జబర్దస్త్ బాటే అని అనిపిస్తోంది. తాజాగా జబర్దస్త్ వచ్చేవారం ప్రోమో, ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో విడుదల అయ్యాయి. రెండింటిలోనూ రోజా ఒక్కరే న్యాయనిర్ణేత గా కనిపించారు. అంటే ఇంకా నాగబాబుకు రీప్లేస్ దొరకలేదని చెప్పుకోవచ్చు. జబర్దస్త్ ప్రోమోలో ఆది తనదైన శైలి లో పంచ్ ల వర్షం కురిపించారు. స్కిట్ స్టార్టింగ్ లో బిస్కట్ కార్యక్రమంలో భాగంగా రోజా మీద నగరి ఎమ్మెల్యే రోజా అంటూ క్రీమ్ బిస్కెట్ పంచ్ వేసేశారు ఆది. ఇది నాగబాబు లేని జబర్దస్త్ ప్రోమో జోరు.

ఇక ఎగస్ట్రా జబర్దస్త్ ప్రోమో చాలా హంగామాగా ఉంది. నితిన్ తాజా సినిమా అర్జున్ సురవరం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎగస్ట్రా జబర్దస్త్ షోలో సందడి చేస్తూ కనిపించారు. చమ్మక్ చంద్రను రీప్లేస్ చేస్తూ రాకేష్ ను జబర్దస్త్ నుంచి ఎగస్ట్రా జబర్దస్త్ కి తీసుకువచ్చారు. పిల్లలను వేసుకుని ధనా ధన్ పంచ్ లు పేలుస్తూ రాకేష్ రెచ్చిపోయారు. మీరిద్దరూ తీసుకునే లాగ్ తో పోలిస్తే ఇదో లాగా అంటూ అప్పారావు భార్య.. మా ఆయన మీ స్కిట్ లు ఎన్ని లేపలేదు.. అంటూ శాంతి స్వరూప్ భార్య ఇలా ఫ్యామిలీ ప్యాక్ లా మార్చేశారు ఎగస్ట్రా జబర్దస్త్ ను.

మొత్తమ్మీద ఏడేళ్ల తరువాత నాగబాబు లేకుండా మల్లెమాల జబర్దస్త్ హంగామా చేయడానికి సిద్ధం అయిపొయింది. మరి ఇవి ఎలా ఉన్నాయి.. నాగబాబు లేని జబర్దస్త్ ని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు తెలియాలంటే వచ్చే గురువారం వరకూ ఆగాల్సిందే!

K V D Varma

K V D Varma

Next Story