Top
logo

నాగాశౌర్య హెవీ రిస్క్ ఇది!

నాగాశౌర్య హెవీ రిస్క్ ఇది!
X

Naga Shaurya 

Highlights

Naga Shaurya : ఇప్పటివరకూ క్లాస్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చిన యంగ్ హీరో నాగాశౌర్య ఇప్పుడు టోటల్ గా లుక్ మార్చేశాడు.

Naga Shaurya : ఇప్పటివరకూ క్లాస్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చిన యంగ్ హీరో నాగాశౌర్య ఇప్పుడు టోటల్ గా లుక్ మార్చేశాడు. తన తదుపరి చిత్రం కోసం మాస్ లుక్ లో కనిపించి అభిమానులకి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం నాగశౌర్య సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఇది నాగశౌర్యకి 20 వ చిత్రం కావడం విశేషం.. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఆ మధ్య రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాలో నాగశౌర్య ఎయిట్ ప్యాక్ బాడీతో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ ఎయిట్ ప్యాక్ బాడీ కోసం నాగశౌర్య బాగానే కష్టపడుతున్నాడు.. డైట్ ఫాలో అవుతూ ప్రతిరోజూ జిమ్‌లో చెమ‌టలు చిందిస్తున్నాడు.. వాస్తావానికి ఫిట్ బాడీని అన్నివేళ‌లా ఒకేలా మెయింటైన్ చేయడం అంటే అది మామలు విషయం కాదు.. దీనికోసం నాగశౌర్య గ‌త ఐదు రోజులుగా నీళ్లు తాగ‌డం కూడా ఆపేశారట.. క‌నీసం లాలాజ‌లాన్ని కూడా మింగ‌డం లేదంటే అయన ఫిట్‌నెస్ కోసం ఎంత కష్టపడుతున్నాడో అర్ధం చేసుకోవచ్చు..

ఇక ఈ సినిమాని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్, ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఇందులో కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తోంది.. జగపతిబాబు మరో కీలక పాత్రలో కనిపిస్తున్నారు.. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి.

Web TitleNaga Shaurya didn't drink water for five days to maintain his chiselled body for his upcoming movie
Next Story