Naga Shaurya 20 First Look Released: అదిరిన నాగశౌర్య 20 ఫస్ట్‌లుక్

Naga Shaurya 20 First Look Released: అదిరిన నాగశౌర్య 20 ఫస్ట్‌లుక్
x
Naga shaurya 20 first look released
Highlights

Naga Shaurya 20 First Look Released: ఇప్పటివరకూ క్లాస్ లుక్ తో ఆకట్టుకున్న యంగ్ హీరో నాగాశౌర్య ఇప్పుడు టోటల్ గా లుక్ మార్చేశాడు. మాస్ లుక్ లోకి వచ్చి అభిమానులకి షాక్ ఇచ్చాడు.

Naga Shaurya 20 First Look Released: ఇప్పటివరకూ క్లాస్ లుక్ తో ఆకట్టుకున్న యంగ్ హీరో నాగాశౌర్య ఇప్పుడు టోటల్ గా లుక్ మార్చేశాడు. మాస్ లుక్ లోకి వచ్చి అభిమానులకి షాక్ ఇచ్చాడు. తాజాగా నాగశౌర్య సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఇది నాగశౌర్యకి 20 వ చిత్రం కావడం విశేషం.. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నాగశౌర్య లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. ఒంటిపై పచ్చబొట్టు, కండలు తిరిగిన దేహం, చేతిలో బాణంతో చాలా సీరియస్‌గా సూపర్బ్‌గా కనిపిస్తున్నారు నాగశౌర్య. ఇక లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఫస్ట్ లుక్ పైన నాగశౌర్య ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ .. 'మనస్సు, ఆత్మ అన్నీ లక్ష్యం పైనే గురిపెట్టాయి'' అని పేర్కొన్నారు.

ఫస్ట్ లుక్ చూస్తుంటే ప్రాచీన విలువిద్య నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. మొన్న రిలీజ్ అయిన ప్రీ లుక్, ఈ రోజు విడుదలైన ఫస్ట్ లుక్ సినిమా పైన మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. త్వరలో సినిమా పట్టాలేక్కనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories