లేడీ డైరెక్టర్ ని పక్కకు పెట్టేసిన నాగచైతన్య మరియు సమంత

Lady Director: నిన్న మొన్నటి దాకా టాలీవుడ్ సార్ కపుల్ గా ఉండే నాగచైతన్య మరియు సమంత ఈ మధ్యనే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

admin1
Published on: 14 Jan 2022 11:44 AM IST
Naga Chaitanya & Samantha Gave Hand To Lady Director?
X

లేడీ డైరెక్టర్ ని పక్కకు పెట్టేసిన నాగచైతన్య మరియు సమంత

Lady Director: నిన్న మొన్నటి దాకా టాలీవుడ్ సార్ కపుల్ గా ఉండే నాగచైతన్య మరియు సమంత ఈ మధ్యనే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ ఒక లేడీ డైరెక్టర్ తో చేయాల్సిన సినిమాని పక్కకు నెట్టేస్తున్నారు. ప్రస్తుతం సంతోష్ శోభన్, మాలవిక నాయర్ హీరోహీరోయిన్లుగా లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత నాగచైతన్యతో కానీ సమంతతో కానీ ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ సమంత తన బాలీవుడ్ డెబ్యూ మరియు ఇతర తెలుగు సినిమాలతో బిజీగా ఉండి చేయలేకపోతోంది.

ఇక కనీసం నాగచైతన్య అయినా నందినీతో సినిమా చేస్తాడు అనుకుంటే తను "థాంక్యూ" సినిమాని పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు, ఆ తరువాత అమెజాన్ ప్రైమ్ కోసం ఒక హారర్ వెబ్ సిరీస్ మరియు ఆ తర్వాత పరశురాం తో ఒక సినిమా అంటూ నాగచైతన్య పెద్ద లిస్టే చెబుతున్నాడు. ఇలా ఇద్దరూ ఈమెతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు కానీ డేట్ లు మాత్రం ఇవ్వలేకపోతున్నారు. ఇంతకుముందు నందినీరెడ్డి వీరిద్దరితో ఒక సినిమా చేయాలని అనుకునేది కానీ ఇప్పుడు విడాకుల తర్వాత నాగచైతన్య సమంత కలిసి నటించడం జరగదని చెప్పచ్చు.

admin1

admin1

Next Story