వరుసగా సినిమాలు లైన్లో పెట్టేస్తున్న అక్కినేని హీరో

వరుసగా సినిమాలు లైన్లో పెట్టేస్తున్న అక్కినేని హీరో
x
Highlights

వరుస డిజాస్టర్ సినిమాలతో అక్కినేని నాగచైతన్య సతమతమవుతున్నాడు. ఈ మధ్యనే విడుదలైన 'సవ్యసాచి' సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే...

వరుస డిజాస్టర్ సినిమాలతో అక్కినేని నాగచైతన్య సతమతమవుతున్నాడు. ఈ మధ్యనే విడుదలైన 'సవ్యసాచి' సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే ప్రస్తుతం నాగచైతన్య సమంత హీరోయిన్ గా 'మజిలీ' అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. పెళ్లయిన తర్వాత చై,సామ్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు అప్పుడే నాగచైతన్య తదుపరి ప్రాజెక్టు లను లైన్లో పెట్టేస్తున్నాడు. ఇప్పటికే నాగచైతన్య సీనియర్ హీరో వెంకటేష్ తో 'వెంకీ మామ' సినిమా కు సైన్ చేశాడు. తాజా సమాచారం ప్రకారం నాగ చైతన్య ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మరొక సినిమా లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. 'పిఎస్వి గరుడవేగ' తో హిట్ అందుకున్న ప్రవీణ్ సత్తారు ప్రస్తుతం పుల్లెల గోపీచంద్ బయోపిక్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత నాగచైతన్య హీరోగా ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను కామాక్షి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories