Laal Singh Chaddha: ఆమీర్ ఖాన్ చిత్రంలో "అక్కినేని హీరో"

Laal Singh Chaddha: తెలుగులో "జోష్" సినిమాతో హీరోగా వెండితెరకి పరిచయం అయిన అక్కినేని వారసుడు "మజిలీ" చిత్రం వరకు..

Sandeep Reddy
Published on: 8 July 2021 2:22 PM IST
Naga Chaitanya Joined in Aamir Khan New Movie Laal Singh Chaddha Sets for Shooting
X

ఆమీర్ ఖాన్ చిత్రంలో నాగ చైతన్య

Laal Singh Chaddha: తెలుగులో "జోష్" సినిమాతో హీరోగా వెండితెరకి పరిచయం అయిన అక్కినేని వారసుడు "మజిలీ" చిత్రం వరకు విభిన్న పాత్రలను పోషించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చికున్న హీరో అక్కినేని నాగ చైతన్య త్వరలో బాలీవుడ్ చిత్రంలో కనిపించబోతున్నాడు. హాలీవుడ్ చిత్రం "ఫారెస్ట్ గంప్" అనే చిత్రాన్ని బాలీవుడ్ లో ఆమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న "లాల్ సింగ్ చద్దా" చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. గురువారం లడఖ్ లో జరుగుతున్న ఆ సినిమా షూటింగ్ లో పాల్గొన్న నాగ చైతన్య ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్రలో ఆమీర్ ఖాన్ తో వెండి తెరని పంచుకోనున్నాడు. ఈ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నాగ చైతన్య ఇటీవలే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన "లవ్ స్టోరీ" చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది.

ఇటీవలే సమంత కూడా "ఫ్యామిలీ మ్యాన్ -2" వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టడంతో ఈ జంట అటు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను వరుస చిత్రాల అవకాశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. 20 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొననున్న నాగ చైతన్య "లాల్ సింగ్ చద్దా" సినిమాలో ఆర్మీ లుక్ కోసం కొంత కాలం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆమీర్ ఖాన్, రాధిక చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క నాగ చైతన్య ఈ సినిమా షూటింగ్ తర్వాత మనం, 24, నాని గ్యాంగ్ లీడర్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్ "థ్యాంక్ యూ" సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు

Sandeep Reddy

Sandeep Reddy

Next Story