Samantha - Naga Chaitanya: సమంతకి నాగ చైతన్య "థాంక్స్"..!!

Sandeep Reddy
Updated on: 8 Oct 2021 6:20 PM IST
Naga Chaitanya Exchange Tweets with Samantha About Love Story Trailer
X

నాగచైతన్య, సమంత (ట్విట్టర్ ఫోటో)

Samantha - Naga Chaitanya: "ఏ మాయ చేసావే" చిత్రంతో ప్రేమలో పడిన అక్కినేని నాగచైతన్య, సమంత దాదాపు ఏడేళ్ళ ప్రేమాయణం తరువాత కుటుంబ సభ్యుల అంగీకారంతో ఒక్కటై టాలీవుడ్ లో స్టార్ కపుల్ గా నిలిచారు. పెళ్లి అయిన తరువాత కూడా వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ జంటపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విడిపోతున్నారనే వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరి మధ్య మనస్పార్ధాలు వచ్చాయని, ఈ విషయంలో కుటుంబ సభ్యుల మాటలు కూడా ఎవరు వినడం లేదని చివరికి ఈ విషయం కోర్టు వరకు వెళ్లిందనే వార్తలు వినిపించాయి. అందుకోసం ఇద్దరికీ పెద్దల మధ్య కౌన్సిలింగ్ కూడా ఇప్పించారని తెలిసింది.

ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తరువాత ఈ వార్తలు రావడం ఆ సమయంలోనే సమంత తన మామయ్య నాగార్జున పుట్టిన రోజుకు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపితే నాగ్ ఆ ట్వీట్ కి స్పందించకపోవడం.., సమంత తన పేరును సోషల్ మీడియాలో ఎస్ గా మార్చడంతో అందరు ఆ వార్తలు నిజమనే అనుకున్నారు. ఇటీవల సమంత గోవాలో సింగల్ గా గడపడం, లాల్ చద్ద షూటింగ్ తో నాగ చైతన్య తరువాత చైతు పార్క్ హయత్ హోటల్ లోనే ఎక్కువ గడుపుతున్నాడని టాలీవుడ్ వర్గాల్లోనూ వార్తలు వినిపించాయి.

అయితే ఇప్పటివరకు వస్తున్న వార్తలన్నీ పాటాపంచెలు చేస్తూ లవ్ స్టొరీ సినిమాకి అల్ ది బెస్ట్ చెబుతూ సమంత.. నాగ చైతన్య ట్వీట్ కి సోమవారం రిప్లై ఇవ్వడంతో అక్కినేని అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఆ సమంత ట్వీట్ కి మంగళవారం ఉదయం నాగచైతన్య "థాంక్స్ సామ్" అని రిప్లై ఇవ్వడంతో వీరి మధ్య ఇన్ని రోజుల నుండి వస్తున్న వార్తలు అన్నింటికీ తమ మధ్య ప్రేమ ఏ మాత్రం తగ్గలేదని "లవ్ స్టొరీ" సినిమా ప్రమోషన్ తో ఫుల్ స్టాప్ పెట్టేశారు. తాజాగా వీరిద్దరి మధ్య ట్వీట్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story