త్వరలో మెగా బ్రదర్ ఇంట్లో వినపడనున్న పెళ్లి బాజాలు

Ruthvik
Published on: 13 Feb 2019 11:55 AM IST
త్వరలో మెగా బ్రదర్ ఇంట్లో వినపడనున్న పెళ్లి బాజాలు
X

తన కూతురు నిహారిక కొణిదెల కు త్వరలో మంచి కుర్రాడిని చూసి పెళ్లి చేస్తామని మెగా బ్రదర్ నాగబాబు చెబుతున్నారు. ఈ మధ్యనే ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక గురించి మాట్లాడుతూ ఈ మాట అన్నారు. "నిహారిక మొదటి సినిమా 'ఒక మనసు' అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. తర్వాత తమిళంలో నటించి పర్వాలేదు అనిపించింది. ఇక మూడవ సినిమా 'హ్యాపీ వెడ్డింగ్' కూడా సరిగా ఆడలేదు. సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్ లో కూడా నటించి మంచి పేరుతెచ్చుకుంది. ఇప్పుడు 'సూర్యకాంతం' సినిమాతో సినిమాలో నటిస్తోంది." అన్నారు నాగబాబు.

ఆడపిల్ల కధ నటనకు ఎందుకు పంపడం అని అనుకుంటున్న సమయంలో 'నేను కూడా నటిస్తాను. మంచి కథలను ఎంచుకుంటాను. కుటుంబంలో అందరూ నటులు ఉన్నప్పుడు నాకు మాత్రం ఎందుకు నటించాలని ఉండదు' అని అడిగింది. అందుకే ఒప్పుకున్నాను. మూడేళ్ల తర్వాత పెళ్లి చేస్తాను అంటే సరే అంది. 2018 వరకు టైం ఇచ్చాము 2019 వచ్చింది కాబట్టి పెళ్లి చేస్తాను. కులం మతం పట్టింపులు నాకు ఏమీ లేవు సినిమా రంగం నుంచి అల్లుడు కావాలని ఆంక్షలు లేవు. మంచి గుణగణాలు, పద్ధతి ఉన్న అబ్బాయి అయితే చాలు" అని చెప్పుకొచ్చారు నాగబాబు.

Ruthvik

Ruthvik

Next Story