Pawan Kalyan: హరీశ్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కొత్త సినిమా

Pawan Kalyan: హరీశ్ శంకర్ డైరెక్షన్ లో రాబోయే చిత్రం పవన్ లుక్ ఇదేనంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Kranthi
Published on: 9 Jun 2021 7:31 AM IST
Mytri Movie Makers Update About Pawan Kalyan New Movie
X

Pawan Kalyan:(File Image)

Pawan Kalyan: గబ్బర్ సింగ్ కా ఫౌజీయోం కో తొందర పెరిగిపోయింది. పవర్ స్టార్ పవన్ ఫ్యాన్స్.. తమ అభిమాన కథానాయకుడు వరుసగా సినిమాలు చేస్తుండటం.. పైగా వకీల్ సాబ్ మంచి హిట్ కావడంతో పండగ చేసుకుంటున్నారు. మొన్నటి దాకా సినిమాలు లేకపోవడంతో సైలెంట్ అయిపోయిన ఫ్యాన్స్ ఇప్పుడు టాలీవుడ్ కింగ్ తమవాడేనంటూ కాలర్ ఎగరేస్తున్నారు. ఇప్పుడు ఆ ఆనందం ఎక్కువైపోయి పవన్ సినిమాల లుక్స్ యూనిట్ వాళ్లు రిలీజ్ చేయకుండానే.. తామే డిజైన్ చేసి.. తమకు నచ్చినట్లుగా ఓ రేంజ్ లో పవన్ ను పెట్టి .. ఆ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అదే ఒరిజనల్ అనుకుని మిగతా ఫ్యాన్స్ కూడా తెగ లైక్స్ కొట్టేసి షేర్ చేసేస్తున్నారు.

పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ వీళ్లిద్దరూ జత కలుస్తుండడంతో ఈసారి ఇంకెంత పెద్ద హిట్ వస్తుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హరీశ్ శంకర్ డైరెక్షన్ లో తాజాగా రాబోయే చిత్రం పవన్ కెరీర్ లో 28వది. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తోంది. అయితే, ఈ సినిమాలో పవన్ లుక్ ఇదేనంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పైగా, టైటిల్ విషయంలోనూ కొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రచారం బాగా ముదరడంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది.

వాస్తవానికి పవన్ 28వ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ ఉగాది రోజున విడుదల చేయాలని నిర్ణయించామని, కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆ నిర్ణయం వాయిదా పడిందని వెల్లడించింది. అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ కొత్త చిత్రానికి సంబంధించి కొన్ని అంశాలు వినిపిస్తున్నాయని, వాటిలో నిజం లేదని మైత్రీ మూవీ మేకర్స్ స్పష్టం చేసింది. పవన్ 28వ చిత్రానికి సంబంధించి ఏ విషయం అయినా తమ అధికారిక ఖాతాల ద్వారానే వెల్లడిస్తామని పేర్కొంది. అభిమానులు ఈ విషయం గమనించాలని సూచించింది.

Kranthi

Kranthi

Next Story