My Village Show: గంగవ్వ నెల సంపాదన ఎంతో తెలుసా?

My Village Show Gangavva: గంగవ్వ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు.

Arun Chilukuri
Published on: 6 Oct 2022 1:44 PM IST
My Village Show Gangavva One Month Income
X

My Village Show: గంగవ్వ నెల సంపాదన ఎంతో తెలుసా?

My Village Show Gangavva: గంగవ్వ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. మారుమూల పల్లె నుంచి విదేశాల్లో ఉండే తెలుగువారి దాకా అందరికి తెలిసిన పేరు గంగవ్వ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామం లంబాడీపల్లె. తెలంగాణలో ఉండే పల్లె అందాలకు సాంప్రదాయాలు అన్ని ఈ గ్రామంలో స్పష్టంగా కన్పిస్తాయి. ఇలాంటి మారుమూల పల్లె నుంచి వచ్చిన ఓ వృద్ధురాలే ఇప్పుడు ఓ యూట్యూబ్ స్టార్‌గా మారిపోయింది.

యూట్యూబ్‌ స్టార్‌గా ఎదిగిన గంగవ్వ అదే క్రేజ్‌తో బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో అడుగు పెట్టి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. మల్లేషం, ఇస్మార్ట్‌ శంకర్, లవ్‌ స్టోరీ, రాజ రాజ చోర వంటి చిత్రాల్లో సైతం నటించింది. ఇదిలా ఉండ‌గా ప్రస్తుతం గంగ‌వ్వ మైవీలేజ్ షోలో న‌టిస్తూనే సినిమాల్లోనూ ఫుల్ బిజీగా మారిపోయారు. యూట్యూబ్‌తో ఎంతో పాపులారిటి సంపాదించుకున్న గంగవ్వ సంపాదన ఎంతనేది ఆసక్తిగా మారింది.

దీంతో ఆరా తీయగా యూట్యూబ్‌ ద్వారా భారీగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అన్ని ఖర్చులు పోను నెలకు లక్ష రూపాయల వరకు గంగవ్వకు ఆదాయం వస్తున్నట్టు సమాచారం. తను ఒక్కరోజు కాల్ షీట్ కోసం 10వేల రూపాయ‌ల వరకూ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటార‌ని తెలుస్తోంది. ఏదేమైన ఈ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటూ ఇలా సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకోవడం విశేషం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story