MS Dhoni Biopic: రీ-రిలీజ్ కు రెడీ అయిన ఎంఎస్ ధోనీ బయోపిక్

MS Dhoni Biopic: మన టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది.

Dhatripriya
Updated on: 2 May 2023 9:31 PM IST
MS Dhoni Biopic Is Ready For Re Release
X

MS Dhoni Biopic: రీ-రిలీజ్ కు రెడీ అయిన ఎంఎస్ ధోనీ బయోపిక్

Dhoni Biopic: మన టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోస్ బర్త్ డేస్ వంటి స్పెషల్ అకేషన్స్ ను సెలబ్రేట్ చేస్తూ వారు నటించిన సినిమాలను రీ రిలీజ్ చేసి అభిమానులను అలరించడమే కాదు కాసులను కొల్లగొడుతున్నారు. మహేష్ బాబు ఆల్ టైమ్ హిట్ పోకిరి చిత్రాన్ని రీ రిలీజ్ చేసి నిర్మాతలు కోట్లు కొల్లగొట్టారు. పవన్ ఎవర్ర్ గ్రీన్ హిట్ ఖుషీ సినిమా సైతం రీ రిలీజ్ అయ్యి పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూపింది. ఇక రీసెంట్ గా ఆరెంజ్ సినిమాని రీ రిలీజ్ చేస్తే..ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్లు రాబట్టింది.

త్వరలో ఎన్టీఆర్ సింహాద్రి మూవీని రీ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. టాలీవుడ్ లో సూపర్ హిట్టయిన రీ రిలీజ్ ట్రెండ్ ని బాలీవుడ్ ఫాలో చేస్తోంది. అటు క్రికెట్ లవర్స్ ని ఇటు సినీ లవర్స్ ని టార్గెట్ చేసుకొని ఎంఎస్ ధోనీ బయోపిక్ ఎంఎస్ ధోనీ ది అన్ టోల్డ్ స్టోరీని రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రంలో ధోనీ ప్రేమ వ్యవహారం, పెళ్లి ముచ్చట్లతో పాటు మిస్టర్ కూల్ క్రికెట్ ప్రస్థానాన్ని ఆడియెన్స్ ముందుకు తెచ్చారు. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ధోనీ పాత్రలో నటించగా, దిశా పటానీ, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటించారు. ధోనీ బయోపిక్ ను ఈ కికెట్ దిగ్గజం బర్త్ డే కానుకగా జూలై 7న గ్రాండ్ గా రీరిలీజ్ చేయనున్నారు. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Dhatripriya

Dhatripriya

Next Story