logo

అక్కినేని వారసుడి కోసం యంగ్ టైగర్

Mr. MajnuMr. Majnu
Highlights

'అఖిల్' సినిమాతో టాలీవుడ్ లో హీరోగా అడుగుపెట్టిన అక్కినేని అఖిల్ మొదటి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు. ఇక రెండవ సినిమా అయిన 'హలో'తో పరవాలేదనిపించిన అఖిల్ ప్రస్తుతం తన మూడవ సినిమాకు రెడీ అవుతున్నాడు.

'అఖిల్' సినిమాతో టాలీవుడ్ లో హీరోగా అడుగుపెట్టిన అక్కినేని అఖిల్ మొదటి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు. ఇక రెండవ సినిమా అయిన 'హలో'తో పరవాలేదనిపించిన అఖిల్ ప్రస్తుతం తన మూడవ సినిమాకు రెడీ అవుతున్నాడు. అక్కినేని అఖిల్ హీరోగా 'తొలిప్రేమ' ఫేమ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'మిస్టర్ మజ్ను' సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం ప్రమోషన్ లో భాగంగా ఈ చిత్ర దర్శక నిర్మాతలు ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.

ఈ నెల 19వ తారీఖున హైదరాబాద్లోని జె ఆర్ సి కన్వెన్షన్ లో సాయంత్రం 6 గంటలకు 'మిస్టర్ మజ్ను' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఎన్టీఆర్ ఎంట్రీ తో సినిమాకి బజ్ పెరుగుతుందని చిత్ర బృందం విశ్వసిస్తోంది. 'సవ్యసాచి' ఫేమ్ నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా కు ఎస్.ఎస్.థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.


లైవ్ టీవి


Share it
Top