మొత్తానికి హిట్ అందుకున్న యువ హీరో

మొత్తానికి హిట్ అందుకున్న యువ హీరో
x
Highlights

మొదటి రెండు సినిమాలు అయిన 'అఖిల్', 'హలో' సినిమాలతో డిజాస్టర్ ను అందుకున్న అక్కినేని యువ హీరో అఖిల్ ఈ మధ్యనే తన మూడవ సినిమా అయిన 'మిస్టర్ మజ్ను' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మొదటి రెండు సినిమాలు అయిన 'అఖిల్', 'హలో' సినిమాలతో డిజాస్టర్ ను అందుకున్న అక్కినేని యువ హీరో అఖిల్ ఈ మధ్యనే తన మూడవ సినిమా అయిన 'మిస్టర్ మజ్ను' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో 'సవ్యసాచి' ఫేమ్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా మొత్తంలో అఖిల్ పెర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచింది అని ఫ్యాన్స్ అఖిల్ ను అభినందిస్తున్నారు.

ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ అందుతుంది. థియేటర్ల నుంచి కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా మంచి వసూళ్లనే నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి. పైగా అందరి వద్ద నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో థియేటర్లలో కూడా 'మిస్టర్ మజ్ను' హడావిడి బాగానే కనిపిస్తోంది. అఖిల్ మిగతా రెండు సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కచ్చితంగా మంచి వసూళ్లనే తీసుకొస్తుందని ట్రేడ్ వర్గాలు కూడా నమ్మకంతో చెబుతున్నాయి. ఇక ఎట్టకేలకు అఖిల్ హిట్ సాధించినందుకు అక్కినేని ఫ్యాన్స్ అభిమానులు సంతోషిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories