logo

మొదటి రోజు 'మిస్టర్ మజ్ను' కలెక్షన్లు

యంగ్ హీరో అఖిల్ అక్కినేని రెండు డిజాస్టర్లు తరువాత 'మిస్టర్ మజ్ను' తో హిట్ అందుకున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.

మొదటి రోజు

యంగ్ హీరో అఖిల్ అక్కినేని రెండు డిజాస్టర్లు తరువాత 'మిస్టర్ మజ్ను' తో హిట్ అందుకున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఎస్.ఎస్.థమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నిన్ననే విడుదలైంది. మొదటి రోజు నుంచే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంది. అఖిల్ నటనపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక మొదటి రోజున 'మిస్టర్ మజ్ను' 4.35 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

కేవలం మొదటి రోజులోనే 7.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను నమోదు చేసుకుంది 'మిస్టర్ మజ్ను'. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 24 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. అంటే ఈ సినిమాకి మంచి ప్రారంభం లభించిందని చెప్పుకోవచ్చు. మరి కొన్ని రోజుల్లో సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ ను చేరుకుంటుందని హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి అక్కినేని అఖిల్ కు ఒక హిట్ దొరికిందని అక్కినేని ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు.

నిజాం: 1.02 కోట్లు

వైజాగ్: 0.41 కోట్లు

ఈస్ట్: 0.20 కోట్లు

వెస్ట్: 0.16 కోట్లు

కృష్ణ: 0.26 కోట్లు

గుంటూరు: 0.54 కోట్లు

నెల్లూరు: 0.12 కోట్లు

ఆంధ్ర: 1.69 కోట్లు

సీడెడ్: 0.44 కోట్లు

నిజాం+ఏపీ: 3.15 కోట్లు

కర్ణాటక: 0.68 కోట్లు

యు.ఎస్.ఏ: 0.35 కోట్లు

మిగతా చోట్ల: 0.17 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా టోటల్: 4.35 కోట్లు.

లైవ్ టీవి

Share it
Top