Theaters: తెలంగాణ థియేటర్లలో మొదలుకానున్న సందడి

Theaters: ఈ నెల 30న మూడు సినిమాలు రిలీజ్‌ * తేజ సజ్జ, ప్రియా వారియర్‌ జంటగా ఇష్క్

Sandeep Eggoju
Published on: 27 July 2021 10:34 AM IST
Movies Release Starts From 30th July
X

ఈ నెల 30 నుంచి తెరుచుకోనున్న సినిమా హాళ్లు (ఫైల్ ఇమేజ్)

Theaters: కరోనా సెకండ్‌వేవ్‌ కారణంగా తెలంగాణలో మూతపడ్డ థియేటర్లు మళ్లీ తెరుచుకున్నాయి. జులై 30న మూడు సినిమాలు రిలీజ్‌ అవుతుండటంతో ఫిల్మ్ ట్రేడ్‌ వర్గాల్లో సందడి వాతావరణం నెలకొంది. జాంబిరెడ్డి తర్వాత తేజ సజ్జ నటిస్తున్న చిత్రం ఇష్క్‌. ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఎస్‌ఎస్‌ రాజు దర్శకత్వంలో ఆర్‌బీ చౌదరి సమర్పణలో ఎన్‌వీ ప్రసాద్‌, పరాస్‌ జైన్‌, వాకాడ అంజన్‌కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న థియేటర్లలో విడుదల కానుంది.

శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలోని తిమ్మరుసు చాలా తెలివైన వ్యక్తి. అలాంటి తెలివితేటలున్న లాయర్‌ పాత్రలో సత్యదేవ్‌ నటించిన చిత్రం తిమ్మరుసు. ప్రియాంకా జవాల్కర్‌ హీరోయిన్‌. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో మహేశ్‌ కోనేరు, సృజన్‌ ఎరబోలు నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 30న థియేటర్లలో విడుదల కానుంది. సెకెండ్ వేవ్ తర్వాత సినిమా రిలీజ్ అవుతుండటంతో యంగ్ టైగర్ ఎన్టీయార్ సినిమా టీమ్ ప్రోమోషన్స్ కు తనవంతు సహకారంగా తిమ్మరసు ట్రైలర్ కూడా లాంచ్ చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story