Thalaivii Movie: అప్పుడు తిట్టిన వారే ఇప్పుడు పొగుడుతున్నారు అంటున్న నిర్మాత

Vishnuvardhan- Thalaivii Movie: ఈ సినిమా కోసం ఓటీటీ ఆఫర్లు చాలానే వచ్చాయి

admin1
Updated on: 8 Oct 2021 5:59 PM IST
Movie Producer Vishnuvardhan Induri Says I am Very Happy with the Release of  Thalaivii Movie
X

విష్ణువర్ధన్ ఇండూరి (ఫోటో- ది హన్స్ ఇండియా)

Vishnuvardhan Induri - Thalaivii Movie: "తలైవి" సినిమా హిట్టవడంతో చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు నిర్మాత విష్ణువర్ధన్ ఇండూరి. నటి మరియు దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో జయలలిత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కనిపించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో సెప్టెంబర్ 10న విడుదలైంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ విష్ణువర్ధన్ థియేట్రికల్ రైట్స్ తోపాటు బడ్జెట్ మొత్తం రికవరీ అయిపోయిందని, పెట్టిన ఖర్చు కంటే ఎక్కువ ఉందని స్పష్టం చేశారు.

ఈ సినిమా కోసం ఓటీటీ ఆఫర్లు చాలానే వచ్చాయి కానీ తాను మాత్రం మొదటి ప్రాధాన్యత థియేటర్ల కే ఇచ్చామని తెలియజేశారు విష్ణు. కంగనా రనౌత్ గురించి తమిళనాడులో అంతగా తెలీదు కాబట్టి మొదట్లో కొందరు నెగిటివ్ కామెంట్లు చేశారని కానీ సినిమా చూశాక మాత్రం వాళ్లందరూ క్షమాపణలు చెబుతున్నారని అన్నారు. మొదట జయలలిత కుటుంబ సభ్యులు కూడా సినిమా పై కేసు వేశారని కానీ విడుదలైన ఈ సినిమా చూశాక వారి నిర్ణయం మారిందని అన్నారు. సినిమాలో జయలలిత పాత్ర తరువాత ఎంజీఆర్ పాత్రకి అంతే ప్రాధాన్యత ఉంటుందని అందుకే ఆ పాత్ర కోసం విలక్షణ నటుడు అరవింద స్వామి ని ఎంపిక చేసుకున్నామని తెలియజేశారు విష్ణువర్ధన్.

admin1

admin1

Next Story