Sourav Ganguly Biopic : సౌరవ్ గంగూలీ జీవిత చరిత్రపై రాబోతున్న బయోపిక్

* ఇప్పటికే చాలా మంది క్రికెటర్ల బయోపిక్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

admin1
Updated on: 9 Sept 2021 9:30 PM IST
Movie Makers Planning to do Biopic on Sourav Ganguly
X

సౌరవ్ గంగూలీ (ట్విట్టర్ ఫోటో)

Sourav Ganguly Biopic: ఇప్పటికే చాలా మంది క్రికెటర్ల బయోపిక్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. క్రికెట్ దేవుడిగా సచిన్ టెండూల్కర్ బయోపిక్ మంచి రెస్పాన్స్ ను అందుకోగా కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని మీద వచ్చిన బయోపిక్ సూపర్ హిట్ అయింది. మరోవైపు రణ్వీర్ సింగ్ హీరో గా '83' అనే టైటిల్ తో కపిల్ దేవ్ బయోపిక్ కూడా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మరో క్రికెటర్ పై బయోపిక్ తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ క్రికెటర్ ఎవరో కాదు ఒకప్పటి క్రికెటర్ మరియు ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్ అయిన సౌరవ్ గంగూలి. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఇప్పుడు ఒక బయోపిక్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

"క్రికెట్టే నా జీవితం. నేను ఈరోజు గర్వంగా నా తల ఎత్తుకొని నడవగలుగుతున్నాను అంటే దానికి కారణం క్రికెట్. నా క్రికెట్ జర్నీ చాలా స్పెషల్. లవ్ ఫిల్మ్స్ సంస్థ నా క్రికెట్ మరియు జీవిత చరిత్రను వెండితెరపై చూపించబోతోంది," అంటూ ట్వీట్ చేశారు సౌరవ్ గంగూలి. గంగూలీ కెప్టెన్ గా చాలా మంది టాలెంట్ క్రికెటర్లను ఎంకరేజ్ చేశారు. 2003లో వరల్డ్ కప్ ఫైనల్, ఆ తర్వాత. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి, ఆ తర్వాత మళ్లీ 2006లో గంగూలీ మళ్ళీ తిరిగి రావడం, ఇలా చాలా ఆసక్తికరమైన విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. మరి సినిమాలో గంగూలీ పాత్రలో ఎవరు కనిపించబోతున్నారు అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

admin1

admin1

Next Story